బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ షేర్లలో విక్రయాలు

Financial stocks decline - Sakshi

బ్యాంక్‌నిఫ్టీ 3శాతం క్రాష్‌

మార్కెట్‌ ప్రారంభం నుంచి బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఈ రం‍గాలకు చెందిన హెచ్‌డీఎఫ్‌సీ ద్వయం, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్, ఫిన్‌ సర్వీసెస్‌ రంగాలకు చెందిన షేర్లలో విక్రయాలు కొనసాగుతున్నాయి. వాహన ఫైనాన్స్‌ విభాగంలో అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వరుసగా రెండోరోజూ నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది.

లాభాల స్వీకరణ కారణంగా ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బంధన్‌ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ షేర్లు 3శాతం నుంచి 5శాతం నష్టాన్ని చవిచూశాయి.

 4శాతం నష్టపోయిన ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్‌లు:
ఎన్‌బీఎఫ్‌సీ స్టాక్‌లు బజాజ్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్‌, బజాజ్‌ ఫిన్‌సర్వీసెస్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌అండ్‌ఫైనాన్స్‌ కంపెనీ, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు 4శాతం నష్టాన్ని చవిచూశాయి. కరోనా ఎఫెక్ట్‌తో స్వల్పకాలంలో నాన్‌బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ ఇండస్ట్రీస్‌ ఇప్పట్లో రికవరీ అయ్యే అవకాశం లేదని గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.
 
ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ మిడ్‌సమయానికి కల్లా 2.5శాతాన్ని నష్టాన్ని చవిచూసి 21,578 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3శాతం, నిఫ్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ 2.50శాతం పతనాన్ని చవిచూశాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top