Stock Market Crash: Memes Are Trending In Social Media - Sakshi
Sakshi News home page

మార్కెట్‌క్రాష్‌.. సోషల్‌ మీడియాలో నవ్వులు పూయిస్తున్న మీమ్స్‌

Dec 20 2021 2:52 PM | Updated on Dec 20 2021 3:30 PM

Stock Market Crash Memes Are Trending In Social Media - Sakshi

ఒమిక్రాన్‌ భయాలు షేర్‌ మార్కెట్‌ని చుట్టు ముట్టాయి. స్టాక్ మార్కెట్లో కరెక‌్షన్‌ కొనసాగుతోంది. సోమవారం ఉదయం మార్కెట్‌ ప్రారంభమైంది మొదలు మధ్యాహ్నం వరకు బేర్‌ పట్టు వీడటం లేదు. దేశీ సూచీలు నేల చూపులు చేస్తూనే ఉన్నాయి. సెన్సెక్స్‌, నిఫ్టీలో ఒకదానితో ఒకటి పోటీ పడుతూ సర్రున కిందకి జారుతున్నాయి. మార్కెట్‌ ప్రారంభమైన అరగంట సమయంలోనే రూ.5.02 లక్షల మేరకు ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. 

మార్కెట్‌ క్రాష్‌ అవుతుండటంతో సోషల్‌ మీడియాలో మీమ్స్‌ సందండి మొదలైంది. ముఖ్యంగా ఫ్యామిలీమ్యాన్‌ 2 వెబ్‌ సిరీస్‌తో పాపులరైన చెల్లం సార్‌ క్యారెక్టర్స్‌తో మీమ్స్‌ వస్తున్నాయి. చెల్లం సార్‌ మీరెక్కడున్నారు. స్టాక్‌ మార్కెట్‌ ఎందుకు పడిపోతుంది. ఎక్కడి వరకు ఈ డౌన్‌ ఫాల్‌ కొనసాగుతుంది అంటూ మీమ్స్‌ సృష్టిస్తున్నారు.

నిఫ్టీ 50, బ్యాంక్‌ నిఫ్టీలు బాగా నష్టపోతుండటంతో నిఫ్టీని టార్గెట్‌ చేసుకుని నవ్వులు పూయించే మీమ్స్‌ వచ్చాయి. 

మార్కెట్‌ క్రాష్‌కి ఒమిక్రాన్‌ భయాలే కారణమంటూ విశ్లేషకులు చెబుతుండటంతో ఒమిక్రాన్‌పై కూడా మీమ్స్‌ వచ్చాయి

స్టాక్‌ మార్కెట్‌పై వచ్చిన పలు మీమ్స్‌


 

Advertisement
 
Advertisement
Advertisement