
ఆసియా మార్కెట్లలో ఆచితూచి ఆశావహ దృక్పథంతో భారత ఈక్విటీ మార్కెట్లు మంగళవారం సానుకూల ధోరణితో ఫ్లాట్ గా ముగిశాయి. ఇంట్రాడేలో 83,874.29 పాయింట్ల గరిష్టాన్ని తాకిన బీఎస్ఈ సెన్సెక్స్ 90.83 పాయింట్లు (0.11 శాతం) లాభపడి 83,697.29 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 50 కూడా 24.75 పాయింట్లు లేదా 0.1 శాతం స్వల్ప లాభంతో 25,541.8 వద్ద ముగిసింది.
విస్తృత మార్కెట్లలో నిఫ్టీ మిడ్ క్యాప్ 100 సూచీలు ఫ్లాట్ గా స్థిరపడగా, నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 సూచీలు 0.10 శాతం నష్టపోయాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్కేర్, ఫార్మా షేర్లు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ ఆటో, ఐటీ, ఎనర్జీ, ఎఫ్ఎంసీజీ, మీడియా, రియల్టీ షేర్లు నష్టపోయాయి.
ఎన్ఎస్ఈలో 3,020 షేర్లలో 1,491 షేర్లు లాభాల్లో, 1,452 షేర్లు నష్టాల్లో ముగియగా, 77 షేర్లలో ఎలాంటి మార్పులేదు. 96 స్టాక్స్ 52 వారాల గరిష్టాన్ని తాకగా, 24 స్టాక్స్ 52 వారాల కనిష్టాన్ని తాకాయి. అప్పర్ సర్క్యూట్ ను తాకిన స్టాక్స్ సంఖ్య 119కి పెరగ్గా, లోయర్ సర్క్యూట్ పరిమితులకు 43 పడిపోయాయి.
ఎన్ఎస్ఈలో అన్ని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5.36 లక్షల కోట్లుగా ఉంది. మార్కెట్ ఒడిదుడుకులను అంచనా వేసే ఇండియా వీఐఎక్స్ 2.01 శాతం క్షీణించి 12.5 పాయింట్ల వద్ద స్థిరపడింది.