వెకేషన్‌ ఓనర్‌షిప్‌ గురించి తెలుసా?

వెకేషన్‌ ఓనర్‌షిప్‌ గురించి తెలుసా?


ఫైనాన్షియల్‌ బేసిక్స్‌..

సాధారణంగా ఎవరైనా నాణ్యమైన సేవలను కోరుకుంటారు. మరీ ముఖ్యంగా ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్లేటప్పుడు అక్కడ మంచి సేవలు అందుబాటులో ఉండాలని భావిస్తారు. హాలిడేస్‌ను మంచిగా ఎంజాయ్‌ చేయాలనుకుంటారు. మనంతట మనమే ప్లాన్‌ చేసుకొని వెళితే అన్నీ అనుకున్నట్లు జరగకపోవచ్చు. ట్రిప్‌కి వెళ్లిన తర్వాత మన లెక్కలన్నీ తప్పొచ్చు. మనం అనుకున్న దానికన్నా ఎక్కువే ఖర్చవుతుంది ఒక్కొక్కసారి. సేవలు దారుణంగా ఉండొచ్చు. ఇలాంటి తిప్పలు ఎందుకులే అనుకునేవారికి ‘వెకేషన్‌ ఓనర్‌షిప్‌’ అనువుగా ఉంటుంది. వెకేషన్‌ ఓనర్‌షిప్‌లో మనం మన వెకేషన్‌ను ముందుగానే డబ్బులు చెల్లించి కొనుగోలు చేస్తాం.



మహీంద్రా హాలిడేస్‌ వంటి సంస్థలు ఇలాంటి సేవలను ఆఫర్‌ చేస్తున్నాయి. క్లబ్‌ మహీంద్రా సభ్యులు 25 ఏళ్లపాటు ప్రతి ఏడాది ఏడు రోజుల హాలిడేస్‌ను సంస్థకు చెందిన 49 రిసార్ట్స్‌లో ఎక్కడైనా, మనకు నచ్చిన సమయంలో ఎంజాయ్‌ చేయవచ్చు. హాలిడేస్‌ను రెండు దఫాలుగా విభజించుకోవచ్చు. రిసార్ట్స్‌లోని వసతులు, ఇతర సేవల్లో డిస్కౌంట్‌ పొందొచ్చు. మెంబర్‌షిప్‌ను బట్టి సేవలు మారుతుంటాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top