పీవీఆర్ చేతికి డీఎల్‌ఎఫ్ డీటీ సినిమాస్ | DLF sells DT Cinemas to PVR | Sakshi
Sakshi News home page

పీవీఆర్ చేతికి డీఎల్‌ఎఫ్ డీటీ సినిమాస్

Jun 10 2015 1:23 AM | Updated on Sep 3 2017 3:28 AM

డీఎల్‌ఎఫ్‌కు చెందిన డీటీ సినిమాస్‌ను పీవీఆర్ రూ.500 కోట్లకు కొనుగోలు చేసింది...

డీల్ విలువ రూ.500 కోట్లు...
న్యూఢిల్లీ:
డీఎల్‌ఎఫ్‌కు చెందిన డీటీ సినిమాస్‌ను పీవీఆర్ రూ.500 కోట్లకు కొనుగోలు చేసింది. డీఎల్‌ఎఫ్‌కు చెందిన డీఎల్‌ఎఫ్ యుటిలిటిస్ సంస్థ సినిమా ఎగ్జిబిషన్ బిజినెస్‌ను డీటీ సినిమాస్ పేరుతో నిర్వహిస్తోంది. ఈ సంస్థ  6,000 సీటింగ్ కెపాసిటి ఉన్న 29 స్క్రీన్లతో ఈ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. పీవీఆర్ సినిమాస్ సంస్థ 43 నగరాల్లో 467 స్క్రీన్లను నిర్వహిస్తోంది. డీటీ సినిమాస్ కొనుగోలుతో పీవీఆర్ సంస్థ 44 నగరాల్లో 506 స్క్రీన్లను నిర్వహించే స్థాయికి చేరుతుంది. భారత వినియోగదారులకు ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని అందించే లక్ష్యంలో భాగంగా డిటీ సినిమాస్‌ను కొనుగోలు చేశామని పీవీఆర్ సీఎండీ అజయ్ బిజిలీ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement