
వాషింగ్టన్ : డెలాయిట్ కంపెనీకి చెందిన సర్వర్ హ్యాక్ అయినట్లు రిపోర్టులు వస్తున్నాయి. డెలాయిట్‌కు చెందిన 350 క్లయింట్ల వివరాలు తస్కరణకు గురైనట్లు సమాచారం. సమాచారం చోరికి గురైన క్లయింట్లలో అమెరికా ప్రభుత్వానికి చెందిన నాలుగు డిపార్ట్‌మెంట్లు కూడా ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు ఓ అంతర్జాతీయ పత్రిక కథనాన్ని ప్రచురించింది.
డెలాయిట్ ఊహించిన దాని కంటే పెద్ద మొత్తంలో డేటా చోరికి గురైందని హ్యాకింగ్ నిపుణులు భావిస్తున్నారు. కాగా, ఏంత మొత్తంలో సమాచారం చోరికి గురైందన్న విషయంపై డెలాయిట్ ఇంకా పెదవి విప్పడం లేదు. కేవలం ఆరుగురు క్లయింట్లకు చెందిన సమాచారమే హ్యాకింగ్‌కు గురైనట్లు డెలాయిట్ చెబుతోంది. పేరు చెప్పడానికి ఇష్టపడని వ్యక్తులు చెప్పిన సమాచారం ప్రకారం.. అమెరికాకు చెందిన రాష్ట్ర, ఎనర్జీ, హోం ల్యాండ్ సెక్యూరిటీ, రక్షణ శాఖ డిపార్ట్‌మెంట్లకు చెందిన వివరాలు తస్కరణకు గురయ్యాయి.