5 నగరాల్లో క్రెడాయ్‌ హరిత భవనాలు

Credai to construct green building projects across five cities - Sakshi

ఐజీబీసీతో ఎంవోయూ

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో పర్యావరణ అనుకూలమైన ప్రాజెక్ట్‌లను నిర్మించాలని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) లకి‡్ష్యంచింది. ఇందులో భాగంగా 5 నగరాల్లో హరిత భవనాలను నిర్మించనుంది. ఈ మేరకు క్రెడాయ్‌ యూత్‌వింగ్, క్రెడాయ్‌ ఉమెన్స్‌ వింగ్‌ వ్యవస్థాపక వేడుకలో ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) ఎంవోయూ కుదుర్చుకుంది. తొలుత హైదరాబాద్, ఎన్‌సీఆర్, బెంగళూరు, పుణే, ముంబై నగరాల్లో గ్రీన్‌ బిల్డింగ్స్‌లను నిర్మిస్తామని.. తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తామని క్రెడాయ్‌ అధ్యక్షుడు సతీష్‌ మగర్‌ తెలిపారు. ‘‘రెండు దశాబ్దాలుగా మన దేశం గ్రీన్‌ బిల్డింగ్‌ మూమెంట్‌లో లీడర్‌గా ఉందని, క్యాంపస్, టౌన్‌షిప్స్, సిటీల వంటివి అన్నీ కలిపి 6.8 బిలియన్‌ చ.అ.లకు పైగా హరిత భవనాలున్నాయని’’ ఐజీబీసీ చైర్మన్‌ వీ సురేశ్‌ తెలిపారు. 2012 నుంచి ఐజీబీసీ, క్రెడాయ్‌ మధ్య ఎంవోయూ కుదుర్చుకోవటం ఇది మూడో సారి.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top