512జీబీ స్టోరేజ్‌తో ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్‌ | This Could Be The Worlds First Smartphone With 512GB storage | Sakshi
Sakshi News home page

512జీబీ స్టోరేజ్‌తో ప్రపంచపు తొలి స్మార్ట్‌ఫోన్‌

Mar 23 2018 8:16 PM | Updated on Mar 23 2018 8:16 PM

This Could Be The Worlds First Smartphone With 512GB storage - Sakshi

స్మార్ట్ ఫోన్ కంపెనీలు తమదైన ఫీచర్లతో కస్టమర్లను మరింత ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగా చైనాకు చెందిన హువావే కంపెనీ పి20 పేరుతో ఓ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఎత్తున్న అంచనాలు వెలువడుతున్నాయి. ట్రిపుల్‌ రియర్‌ కెమెరాతో రాబోతుందని ఇప్పటికే కొన్ని రిపోర్టులు పేర్కొనగా.. తాజాగా మరో ఆసక్తికర వార్త ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌కు 512 జీబీ స్టోరేజీ సామర్థ్యం ఉంటుందని తెలుస్తోంది. ఈ స్థాయి స్టోరేజీతో వస్తున్న తొలి ఫోన్ ఇదే. ఇంత వరకు ఈ కంపెనీ గరిష్టంగా 250 జీబీ సామర్థ్యంతోనే స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ అవుతూ ఉన్నాయి. 512 జీబీ సామర్థ్యం అంటే కంప్యూటర్ తో సమానం.

 6జీబీ ర్యామ్‌ ఇందులో ఉంటుందని టీనా లిస్టింగ్‌ రివీల్‌ చేసింది. త్వరలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లోకి రానుంది. ఒకవేళ ఈ స్థాయి స్టోరేజీ సామర్థ్యం, ఫీచర్లతో పి20ని కంపెనీ మార్కెట్లోకి తీసుకొస్తే.. మిగిలిన ప్రధాన కంపెనీలు సైతం ఈ తరహా ఫోన్లను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 512జీబీ స్టోరేజ్‌తో యూజర్లు 4కే వీడియోలను, మూవీలను, బుక్స్‌ను, మ్యూజిక్‌ను రికార్డు చేసుకోవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement