కన్జూమర్‌ ఎంఎన్‌ఎసీలూ వర్క్‌ఫ్రం హోమే

Consumer MNCs ask employees to stay locked in  - Sakshi

ప్రముఖ మల్టీనేషనల్‌ కంపెనీలన్నీ (ఎంఎన్‌సీ) వర్క్‌ఫ్రం హోంకే మొగ్గుచూపుతున్నాయి. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌కు నిబంధనలతో కూడిన సడలింపులు ఇస్తున్నప్పటికీ కోవిడ్‌ కేసులు పెరుగతుండడంతో ఉద్యోగులను ఇంటివద్ద నుంచే పనిచేయమని ఎంఎన్‌సీలు చెబుతున్నాయి. కోకోకోలా, పెప్సికో, నెస్లే, ఎల్‌జీ, రెకిట్‌ బెంక్‌సెర్‌ కంపెనీల ఇండియా కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను ఇంటివద్ద నుంచే పనిచేయమని చెబుతున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం 10 శాతం సిబ్బందితో జూన్‌ 8 నుంచి ప్రైవేటు కార్యాలయాలు తెరవచ్చని అనుమతులు ఇచ్చినప్పటికీ, హిందుస్థాన్‌ యూనీలీవర్‌, పీఅండ్‌ జీ కంపెనీ కార్యాలయాలు ఎప్పుడు తెరవాలి అనేది  ఇంకా నిర్ణయించుకోలేదు.మూడు దశల్లో ఉద్యోగులను అనుముతించేందుకు హెచ్‌యూఎల్‌ ప్రణాళికలు రచిస్తోంది. 
  ఢిల్లీ- నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌(ఎన్‌సీఆర్‌) కేంద్రంగా పనిచేస్తోన్న ఎల్‌జీ, పెప్సికో, నెస్లే, రెకిట్‌ బెంక్‌సెర్‌, ఆమ్‌వే కంపెనీలు వర్క్‌ ఫ్రం హోంకే మద్దతునిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మూతపడిన ఐఫోన్‌  కార్యాలయాలు సైతం ఈ నెలలో తెరవనున్నారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. నెస్లే ఇండియా అధికార ప్రతినిధి మాట్లాడుతూ ..తమ కంపెనీ సిబ్బందిలో ఎక్కువమంది ఇంటి నుంచే పనిచేస్తున్నారని తెలిపారు. ముఖ్యమైన పనులు నిర్వహించేందుకు మాత్రమే అత్యవసరాన్ని బట్టి  కొంతమంది ఉద్యోగులు కార్యాలయానికి వస్తున్నారని వెల్లడించారు. 
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ షావోమీ తమ కంపెనీ సిబ్బందిని రెండు బ్యాచ్‌లుగా విభజించి, ఒక బ్యాచ్‌  వారం రోజులు ఆఫీసుకు వస్తే మరో రెండు వారాలు ఆ బ్యాచ్‌ ఇంటి వద్ద ఉండాలి. ఈ సమయంలో రెండో బ్యాచ్‌ ఆఫీసుకు రావాల్సి ఉంటుంది. ఇక మరో స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వివో జూన్‌15 వరకు వర్క్‌ఫ్రంహోంకు కొనసాగింపుకు అనుమతిస్తుంది.
 

Related Tweets
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top