
రూ. 1,500 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం రిలయన్స్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ఆహారోత్పత్తులు, పానీయాల తయారీకి ఏకీకృత ప్లాంటును ఏర్పాటు చేయనుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్(కాటోల్)లో ఏర్పాటు చేయనున్న ఈ యూనిట్‌పై రూ. 1,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. ఈ యూనిట్ ఏర్పాటుకు డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎఫ్‌ఎంసీజీ విభాగం రిలయన్స్ కన్జూమర్.. మహారాష్ట్ర ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకుంది.
ఈ యూనిట్‌తో 500మందికిపైగా ఉపాధి కల్పించనుంది. 2026లో తయారీ యూనిట్ కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. గత నెలలో నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ సమీకృత ఫుడ్ పార్క్‌ల ఏర్పాటుకు రూ. 40,000 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించిన విషయం విదితమే. ఏఐ ఆధారిత ఆటోమేషన్, రోబోటిక్స్, ఆధునిక టెక్నాలజీలతో ఆసియాలోనే అతిపెద్ద ఫుడ్ పార్క్‌కు తెరతీయనున్నట్లు వివరించారు. రిలయన్స్ రిటైల్ నుంచి ఆవిర్భవించిన రిలయన్స్ కన్జూమర్ మూడేళ్లలోనే రూ. 11,000 కోట్ల టర్నోవర్‌ను సాధించినట్లు ఏజీఎంలో తెలిపారు.