
న్యూఢిల్లీ: ఇప్కా ల్యాబొరేటరీస్ అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ బేషోర్ ఫార్మాస్యూటికల్స్ ఎల్‌ఎల్‌సీలో 80 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ వాటాను అమెరికాలోని తమ అనుబంధ కంపెనీ ఇప్కా ఫార్మాస్యూటికల్స్ ఇన్‌కార్పొ రూ.74.40 కోట్లకు (10.286 మిలియన్ డాలర్లకు) కొనుగోలు చేసిందని ఇప్కా ల్యాబొరేటరీస్ వెల్లడించింది.
తమ జనరిక్స్ ఔషధాలను అమెరికాలో బేషోర్ ఫార్మా ద్వారా విక్రయిస్తామని పేర్కొంది. కాగా, 2017 డిసెంబర్ 31తో ముగిసిన ఏడాది కాలానికి బేషోర్ ఫార్మా కంపెనీ 7.05 మిలియన్ డాలర్ల మొత్తం ఆదాయాన్ని ఆర్జించింది.