చక్కెర పరిశ్రమకు ఊరట : భారీ ప్యాకేజీ

Cabinet okays Rs 4,500-cr package to sugar industry - Sakshi

సాక్షి, ముంబై: భారత చక్కెర పరిశ్రమకు కేంద్రం తీపి కబురు అందించింది. చక్కెర పరిశ్రమలో సంక్షోభాలను గట్టెక్కించడంకోసం కేంద్ర క్యాబినెట్ రు.4,500 కోట్ల ప్యాకేజీ అందించనుంది. ఈ మేరకు ఆహార మంత్రిత్వ శాఖ ప్రతిపాదనలకు బుధవారం ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈసీ) ఆమోదం లభించింది. తద్వారా చక్కెర మిగులు నిల్వలను పరిష్కరించడానికి, భారీ చెరకు బకాయిలు రూ. 130 బిలియన్ల మేరకు క్లియర్ చేయటానికి సహాయం చేస్తుంది. గత ఆర్ధిక సంవత్సరంలో పెంచిన రు.5.50కు ఇది అదనపు పెంపు. గత జూన్‌ మాసంలోనే చక్కెర పరిశ్రమకు కేంద్రం రు. 8,500కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. షుగర్ పరిశ్రమలకు ఇచ్చే ఇథనాల్ ఉత్పత్తి రాయితీ రు. 4,400 కోట్ల నిధులు కూడా ఇందులోనే చేర్చారు. తాజా  నిర్ణయం ప్రకారం  దాదాపు రు.1,332 కోట్ల వడ్డీ రాయితీని కేంద్రం భరించనుంది.

5మిలియన్ టన్నుల ఎగుమతే లక్ష్యం: 2018-19మార్కెటింగ్ (అక్టోబరు-సెప్టెంబర్) సంవత్సరంలో దాదాపు 5 మిలియన్ టన్నుల చక్కెర ఉత్పత్తులను ఎగుమతి చేయలన్నది ప్రభుత్వ లక్ష్యంగా పెట్టుకుంది. 2017-2018 సంవత్సరానికి గాను 32 మిలియన్ టన్నులకే దిగుమతి పరిమితం కావడంతో ఈ దిగుబడులను మరింత పెంచడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే 2018-19 5 మిలియన్ టన్నుల వరకు ఎగుమతులపై చెరకు రైతులకు, రవాణాపై మిల్లులకు సబ్సిడీని రెండు రెట్లు పెంచనుంది.

షుగర్ షేర్లు జూమ్‌: నాలుగు వేల కోట్ల ప్యాకేజ్‌ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లలో షుగర్ కంపెనీల షేర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. శ్రీ రేణుకా షుగర్స్, బజాజ్ హిందుస్థాన్ షుగర్స్, బలరాంపూర్ చిన్నీ, దాల్మియా షుగర్స్, ఈఐడీ ప్యారీ అన్నారిఅమ్మాన్ షుగర్స్ , ద్వారకేష్ షుగర్స్, ఉత్తమ్ షుగర్స్ , రానా షుగర్స్, ఆంధ్ర షుగర్స్ వంటి కంపెనీల షేర్లు పుంజుకున్నాయి. దాదాపు 8శాతానికిపై గా లాభపడ్డాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top