షాపింగ్‌ ఎక్కువగా చేసేది అబ్బాయిలే!!

Boys Are Shopping More Online Than Girls, Says Myntra CEO - Sakshi

న్యూఢిల్లీ : షాపింగ్‌ అంటే అమ్మాయిలని, అమ్మాయిలంటే షాపింగ్‌ అంటూ చమత్కారాలు చేస్తూ ఉంటారు. కానీ షాపింగ్‌ ఎక్కువగా చేసేది అమ్మాయిలు కాదట. అబ్బాయిలే ఎక్కువగా షాపింగ్‌ చేస్తారట. ఈ విషయాన్ని ఎవరు చెప్పారో తెలుసా? అతిపెద్ద ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ షాపింగ్‌ వెబ్‌సైట్‌లైన మింత్రా, జబాంగ్‌ల సీఈవో అనంత్‌ నారాయణన్‌.  55 శాతం అబ్బాయిలే ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తూ ఉన్నారని తెలిపారు. ఇండియా టుడే యూత్‌ సమిట్‌ మైండ్‌ రాక్స్‌లో మాట్లాడిన నారాయణన్‌.. ఈ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

అ‍బ్బాయిలే ఎక్కువ ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేయడానికి కారణం, అమ్మాయిల కంటే ఎక్కువగా వారి వద్దనే స్మార్ట్‌ఫోన్లు కలిగి ఉండటమని పేర్కొన్నారు. షాపర్‌ పరంగా చూసుకుంటే, అమ్మాయిలు ఎక్కువగా తమ వెబ్‌సైట్‌ను సందర్శిస్తే వారి పరిమాణం పెరుగుతోంది. అయినప్పటికీ, అమ్మాయిల కంటే ఎక్కువగా అబ్బాయిలే షాపర్స్‌ను ఆశ్రయిస్తున్నట్టు తెలిసింది. గ్రామీణ, పట్టణ ప్రాంత దుకాణదారులకు ఎలాంటి తేడా లేదని, గ్రామీణ వినియోగదారులు కొనుగోలు చేసే ఉత్పత్తులు, పట్టణ వినియోగదారులు తీసుకునేవి సమానంగా ఉన్నాయని మింత్రా సీఈవో తెలిపారు. 

మింత్రాలో 55 శాతం డిమాండ్‌ టాప్‌ 30 నగరాలను మించి వస్తుందని, మిగతా 45 శాతం టాప్‌ 30 నగరాల నుంచి వెల్లువెత్తుందని చెప్పారు. చాలా గ్రామీణ ప్రాంతాల్లో యాక్సస్‌ లేదు, ఒకవేళ యాక్సస్‌ కల్పిస్తే, పట్టణ ప్రజలు అనుసరించే ట్రెండ్‌నే గ్రామీణ ప్రాంత ప్రజలు ఫాలో అవుతారని పేర్కొన్నారు. గ్లోబల్‌ ట్రెండ్స్‌ భారత్‌కు చాలా వేగంగా విస్తరిస్తాయని, భారతీయులు సరసమైన లేటెస్ట్‌ ఫ్యాషన్‌ను ఎక్కువగా ఇష్టపడుతుంటారని చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top