సచిన్‌ లగ్జరీ కారు కొత్త లుక్‌లో

BMW i8 owned by Sachin Tendulkar modified by DC Design - Sakshi

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు  సూపర్ కార్లంటే మోజు ఎక్కువ. ఈ నేపథ్యంలోనే ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన, అత్యంత విలాసవంతమైన కార్లను  సొంతం చేసుకున్నాడు. మరోవైపు జర్మనీ కార్‌ మేకర్‌  బీఎండబ్ల్యూ బ్రాండ్‌ ఎంబాసిడర్‌గా ఉన్న సచిన్‌  బీఎండబ్ల్యూ7 సిరీస్, ఎం3, ఎం 4 లాంటి లగ్జరీ కార్లను సొంతం చేసుకున్నాడు. ఇపుడు తనువాడే స్పోర్ట్స్‌కారును కొత్త లుక్‌ను జోడించడం విశేషంగా మారింది. 

ముఖ‍్యంగా సచిన్‌ తరచూ వాడే హైబ్రీడ్ స్పోర్ట్స్‌ కారు ఐ8ను  తాజాగా అప్‌డేట్‌ చేయించారు.  పాపులర్‌ డీసీ డిజైన్‌తో మరింత  స్పోర్టివ్‌ లుక్‌ను తీసుకొచ్చారు.  స్పెషల్‌ గ్రిల్లే,  ముందూ వెనుక కొత్త బంపర్స్, క్వాడ్ ఎగ్సాస్ట్ టిప్స్‌,  పెద్ద బంపర్ పానెల్స్‌తో వైడర్‌ మోడ్‌ లుక్‌తో  ఆకర్షణీయంగా రూపొందించడం విశేషం. 

 1.5 లీటర్, 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ ఎలక్ట్రిక్‌ మోటార్‌,  231 బిహెచ్‌పీ, 321 ఎన్ఎమ్ టార్క్  ప్రధాన  ఫీచర్లుగా ఉండగా 4.4 సెకన్లలో  100 కీ.మీవేగాన్ని అందుకుంటుంది. ధర రూ. 2.62 కోట్లు (ఎక్స్ షో రూం ఢిల్లీ)

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top