ఎక్స్చేంజ్‌ ఫౌండర్‌ కన్నుమూత : వందల కోట్లు గోవిందా?

Bitcoin Exchange President Death puts Millions Out of Reach - Sakshi

అనారోగ్యంతో  కెనడియన్‌ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్‌  ఫౌండర్‌​ ఆకస్మిక మరణం

పాస్‌వర్డ్‌ ,  రికరీ కీ తెలియక అయోమయంలో టెక్‌ నిపుణులు

రూ. 982 కోట్ల క్రిప్టో కరెన్సీ ఫ్రీజ్‌, ఆందోళనలో ఇన్వెస్టర్లు

కెనడాకు చెందిన క్రిప్టో కరెన్సీ ఫౌండర్‌  గెరాల్డ్‌ కాటన్‌ ఆకస్మిక మరణం  లక్షలాది మంది ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. ఎందుకంటే క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాంసంబంధించిన పాస్‌వర్డ్‌లు, రికవరీ కీ తదితర ముఖ్యమైన సమాచారం కేవలం గెరాల్డ్‌కు మాత్రమే య తెలుసు. కానీ గత ఏడాది డిసెంబరులో ఆయన ఆకస్మికంగా కన్నుమూశారు. పాస్‌వర్డ్‌, రికవరీ కీ మరెవ్వరికీ తెలియకపోవడంతో, దాదాపు 187 మిలియన్ల కెనడా డాలర్లు( రూ.982 కోట్లు) ఫ్రీజ్‌ అయిపోయాయి. దీనికి  ఈ గండంనుంచి గట్టెక్కేందుకు టెక్‌ నిపుణులు అష్టకష్టాలు పడుతున్నారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించకపోవడంతో సంస్థలో ఇతర అధికారులు తలలు పట్టుకున్నారు.  

మరోవైపు గెరాల్డ్‌ ఎలా చనిపోయాడు? నిజంగా చనిపోయాడా లేదా  కంపెనీ మోసం  చేస్తోందా లాంటి పలు అనుమానాలు, ప్రశ్నలతో  ఆన్‌లైన్‌ దుమారం రేగింది. అంతేకాదు గెరాల్డ్‌ భార్య జెన్నిఫర్‌  రాబర్ట్‌సన్‌కు వేధింపులు, బెదిరింపులు తీవ్ర మయ్యాయి. దీంతో వీటిని నుంచి తనకూ, కంపెనీకి రక్షణ కల్పించాల్సిందిగా ఆమె కోర్టును ఆశ్రయించారు. దీంతో బిట్‌కాయిన్‌,  లైట్‌కాయిన్‌, ఎథిరియం లాంటి డిజిటల్‌ కరెన్సీ ట్రేడింగ్‌ ప్లాట్‌ఫాం క్వాడ్రిగా సీఎక్స్‌ ఎ‍క్స్చేంజ్‌కు నోవా స్కోటియా ఉన్నత న్యాయస్థానం దివాలా రక్షణను మంజూరు చేసింది. ఈ వేదికపై కరెన్సీ ట్రేడింగ్ కూడా నిలిపివేసింది. కేవలం  అతనికి మాత్రమే  తెలిసిన పాస్‌వర్డ్‌లు ఎక్కడా రాసిపెట్టలేదని, దీంతో వాటిని కనుక్కోవడం చాలా కష్టంగా మారిందంటూ కంపెనీ తరపున జెన్నిఫర్‌ రాబర్ట్‌సన్‌  అఫిడవిట్‌ దాఖలు చేశారు. అలాగే  గెరాల్డ్‌  సెల్ ఫోన్లు, ఇతర కంప్యూటర్లలోని సమాచారం కోసం సంబంధిత ఎన్క్రిప్షన్లను ఛేదించడానికి నిపుణులతో ప్రయత్నిస్తున్నామనీ, కానీ ఫలితం లభించలేదన్నారు. క్వాడ్రిగాలో 363,000 యూజర్లు నమోదుగాకా, సుమారు లక్షా పదిహేను వేల మందియూజర్లకు 250 మిలియన్ల కెనడా డాలర్లు రుణపడి ఉన్నామని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో రాబర్ట్‌సన్‌ పేర్కొన్నారు. అటు ఇన్వెస్టర్లు కూడా ఈ వ్యవహారంపై న్యాయపోరాటానికి సిద్ధ పడుతున్నారు.

కాగా ఇండియాలో ఒక అనాధాశ్రయానికి సేవలందిస్తున్న క్రమంలో గెరాల్డ్‌ కాటన్‌  డిసంబరు 9న  చనిపోయారని  జనవరి 14న  సోషల్‌ మీడియా ద్వారా కంపెనీ ప్రకటించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top