
మేడిపల్లి: నిర్మాణ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త టెక్నాలజీతో వినియోగదారులకు అత్యుత్తమ సేవలందిస్తున్నట్లు భారతి సిమెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎం.సి.మల్లారెడ్డి చెప్పారు. ఉప్పల్ పరిధిలోని బిల్డర్లతో మంగళవారం రాత్రి మేడిపల్లి ఎస్‌వీఎం గ్రాండ్ హెటల్‌లో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుతో సహా, కొచ్చిన్, చెన్నై, బెంగళూరు మెట్రోరైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి సుమారు 5లక్షల మెట్రిక్‌టన్నుల సిమెంట్ సరఫరా చేసినట్లు మల్లారెడ్డి తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ దృఢసంకల్పానికి మద్దతుగా నాణ్యమైన సిమెంట్‌ను అందించి తమవంతు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
భారతి సిమెంట్ తెలంగాణలోని అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు సరఫరా చేస్తున్నట్లు సీజీఎం కొండల్‌రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, డబుల్ బెడ్‌రూంల నిర్మాణాలకు కూడా భారతి సిమెంట్ సరఫరా చేస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిల్డర్స్ అసోసియేషన్స్ సెక్రటరీ వెంకటరెడ్డి, సీనియర్ టెక్నికల్ మేనేజర్ ఓబుల్‌రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ సతీష్‌రాజు, టెక్నికల్ మేనేజర్ నరేష్‌కుమార్ పాల్గొన్నారు.