వచ్చే నెల 10న బ్యాంక్‌ యూనియన్ల ధర్నా

Bank unions to stage dharna before Parliament on December 10 - Sakshi

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ డిసెంబర్‌ 10న పార్లమెంట్‌ ముందు భైఠాయించాలని బ్యాంక్‌ యూనియన్లు నిర్ణయించాయి. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల 10 ప్రభుత్వ రంగ బ్యాంకులను 4 బ్యాంకులుగా కుదించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే కాగా, ఈ చర్యతో నాలుగు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆరు విలీనం కానున్నాయి. ఈ విధంగా విలీనం చేయడం వల్ల స్టేక్‌ హోల్డర్లకు ఎటువంటి ప్రయోజనం లేదని యూనియన్లు అంటున్నాయి. విలీనం పూర్తయితే నిరుపేదలు సరసమైన బ్యాంకింగ్‌ సేవలను కచ్చితంగా కోల్పోతారని పేర్కొన్నాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top