బ్యాంకింగ్‌ రంగంలో భారీ సంస్కరణలు

Bank mergers aimed at economic growth, says Finance Minister Nirmala sitharaman- Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  శుక్రవారం కీలక బ్యాంకింగ్‌ రంగ సంస్కరణలు ప్రకటించారు. ముఖ్యంగా ప్రభుత్వం రంగ బ్యాంకుల ఏకీకరణను వెల్లడించారు. బ్యాంకుల రీకాపిటలైజేషన్ (నిధులతో ఉద్దీపన) ద్వారా పలు బ్యాంకులు ఇప్పటికే రెపోరేట్ల ఆధారంగా వడ్డీ రేట్లు తగ్గించేందుకు పలు  ప్రభుత్వ బ్యాంకుల నిర్ణయం తీసుకున్నట్లు నిర్మలా పేర్కొన్నారు.  మొత్తం 10 బ్యాంకులను కలిపి 4 కొత్త అతిపెద్ద  బ్యాంకులుగా రూపొందనున్నాయన్నారు.   దీంతో మొత్తం పీఎస్‌యూల సంఖ్య  27 నుంచి 12కి తగ్గనుంది. అయితే ఈ విలీనం ప్రభావంతో ఎలాంటి తొలగింపులు వుండవని స్పష్టం చేశారు. 

నియామకాలు: నియమాక ప్రమాణాలను, పద్ధతులల్లో కూడా సంస్కరణ తీసుకొస్తున్నట్టు చెప్పారు. దీంతో పాటు బ్యాంకుల బోర్డులను బలోపేతం చేస్తామని, అలాగే బోర్డు సైజ్‌ను నిర్ణయించే అధికారం బ్యాంకులకే ఉంటుందని ఆర్థికమంత్రి వెల్లడించారు. ప్రతీ బ్యాంకులో స్పెషల్‌ రిస్క్‌ ఆఫసర్లను నియమిస్తామనీ, అయితే వీరికి జీతాలు ప్రభుత్వం చెల్లించదని చెప్పారు. బ్యాంకింగ్‌ రంగంలో టెక్నాలజీని వాడకాన్ని ప్రోత్సహిస్తామన్నారు. 

బ్యాంకుల విలీనం: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, (పీఎన్‌బీ) ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ విలీనం ద్వారా 11437 బ్రాంచిలతో  రెండవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా విలీన బ్యాంకు అవతరించనుంది.

ఆంధ్రాబ్యాంక్, యూనియన్ బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంకు ఇకపై కలిసి ఒకే బ్యాంకుగా కొనసాగనున్నాయి. ఈ విలీనంతో దేశంలోనే 5వ అతిపెద్ద ప్రభుత్వం బ్యాంకుగా ఈ విలీన బ్యాంకు అవతరించనుంది. కెనరా బ్యాంక్,  సిండికేట్ బ్యాంక్ విలీనం ద్వారా  నాలుగవ అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకుగా అవతరించనుంది. కాగా మీడియా సమావేశానికి ముందే నిర్మలా సీతారామన్‌ పది ప్రభుత్వ బ్యాంకుల చీఫ్ ఎగ్జిక్యూటివ్‌లతో మంత్రి  భేటీ అయ్యారు ఈ విషయంలో ప్రభుత్వం ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను సంప్రదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top