‘ఆడి క్యూ7, ఏ4’ నూతన ఎడిషన్లు  | Audi AI:ME showcased at Shanghai Auto Show | Sakshi
Sakshi News home page

‘ఆడి క్యూ7, ఏ4’ నూతన ఎడిషన్లు 

Apr 25 2019 12:58 AM | Updated on Apr 25 2019 12:58 AM

Audi AI:ME showcased at Shanghai Auto Show - Sakshi

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘ఆడి’.. తాజాగా తన ఎస్‌యూవీ క్యూ7, సెడాన్‌ ఏ4 మోడళ్లలో ‘లైఫ్‌ స్టైయిల్‌’ పేరుతో నూతన వేరియంట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఆడి క్యూ7 లైఫ్‌ స్టైయిల్‌ ఎడిషన్‌ ధర 75.82 లక్షల రూపాయిలు కాగా, ఏ4 లైఫ్‌ స్టైయిల్‌ ఎడిషన్‌ ధర 43.09 లక్షల రూపాయిలుగా నిర్ణయించింది.

ఈ సందర్భంగా ఆడి ఇండియా హెడ్‌ రహిల్‌ అన్సారి మాట్లాడుతూ.. ‘ఏ6 మోడల్‌కు లైఫ్‌ స్టైయిల్‌ పేరుతో కొత్త వేరియంట్‌ను విడుదల చేశాక మా వినియోగదారుల నుంచి మంచి స్పందన వచ్చింది. నూతన వేరియంట్లకు బలమైన డిమాండ్‌ దక్కింది. ఈ ప్రేరణతో తాజాగా మరో రెండు నూతన వేరియంట్లను విడుదలచేశాం’ అని అన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement