అమెజాన్‌ ఏడు కొత్త వేర్‌హౌస్‌లు! | Amazon: Amazon to add 7 new warehouses in India, hire 4,000 people | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ ఏడు కొత్త వేర్‌హౌస్‌లు!

May 3 2017 2:35 AM | Updated on Sep 5 2017 10:13 AM

అమెజాన్‌ ఏడు కొత్త వేర్‌హౌస్‌లు!

అమెజాన్‌ ఏడు కొత్త వేర్‌హౌస్‌లు!

ప్రముఖ ఈ–కామర్స్‌ సంస్థ ‘అమెజాన్‌’.. భారత్‌లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఇది ఏడు కొత్త వేర్‌హౌస్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

న్యూఢిల్లీ: ప్రముఖ ఈ–కామర్స్‌ సంస్థ ‘అమెజాన్‌’.. భారత్‌లో తన కార్యకలాపాలను వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఇది ఏడు కొత్త వేర్‌హౌస్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో దాదాపు 4,000 మందికి ఉపాధి కలుగుతుందని అంచనా. దేశంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను మరింత విస్తరించాలని అమెజాన్‌ భావిస్తోంది. ‘ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ విభాగాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఇన్వెస్ట్‌మెంట్లను కొనసాగిస్తూనే ఉంటాం’ అని అమెజాన్‌ ఇండియా కస్టమర్‌ ఫుల్‌ఫిల్‌మెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అఖిల్‌ సక్సేనా తెలిపారు. తాజాగా ప్రకటించిన సెంటర్లు తెలంగాణ, హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఏపీ రాష్ట్రాల్లో ఏర్పాటవుతాయని పేర్కొన్నారు. ఈ ఏడాది మొత్తంగా 14 కొత్త కేంద్రాల ఏర్పాటుతో తమ వేర్‌హౌస్‌/ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్ల సంఖ్య 41కి చేరుతుందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement