ఎయిర్‌సెల్ కస్టమర్లకు ఫేస్‌బుక్ ఉచితం | Sakshi
Sakshi News home page

ఎయిర్‌సెల్ కస్టమర్లకు ఫేస్‌బుక్ ఉచితం

Published Thu, Mar 27 2014 1:39 AM

ఎయిర్‌సెల్ కస్టమర్లకు ఫేస్‌బుక్ ఉచితం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ కస్టమర్లకు మరింత చేరువ అయ్యేందుకు టెలికం రంగ కంపెనీ ఎయిర్‌సెల్ తాజాగా ఉచిత ఫేస్‌బుక్ ఆఫర్‌ను ప్రకటించింది. కొత్త కస్టమర్లకు 60 రోజుల కాల పరిమితితో నెలకు 50 ఎంబీ చొప్పున, పాత కస్టమర్లకు 30 రోజుల కాలపరిమితితో 50 ఎంబీ డేటాను ఉచితంగా అందిస్తోంది. 50 ఎంబీ పూర్తి అయితే 10 కేబీ డేటా వాడకానికి 2 పైసలు చార్జీ చేస్తారు.

స్టార్121స్టార్999హ్యాష్ డయల్ చేసి కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఫేస్‌బుక్ కోసం ప్రత్యేక టారిఫ్ ప్యాక్‌లను సైతం కంపెనీ ప్రవేశపెట్టింది. రూ.14 ప్యాక్‌తో 100 ఎంబీ 2జీ/3జీ డేటాను 28 రోజులపాటు వినియోగించుకోవచ్చు. 5 రోజుల వ్యాలిడిటీగల రూ.5 ప్యాక్‌తో 25 ఎంబీ డేటా ఉచితం. అలాగే రూ.5 రీచార్జ్ చేస్తే రూ.10, 20, 30 రీచార్జ్‌పై పూర్తి టాక్‌టైం అందిస్తున్నట్టు ఎయిర్‌సెల్ ఆంధ్రప్రదేశ్ సర్కిల్ బిజినెస్ హెడ్ తివానా బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు.

Advertisement
Advertisement