'హైదరాబాద్‌ కేసీఆర్‌ అబ్బ సొత్తు కాదు' | ysrcp rehman fires on kcr | Sakshi
Sakshi News home page

'హైదరాబాద్‌ కేసీఆర్‌ అబ్బ సొత్తు కాదు'

Sep 2 2013 8:59 PM | Updated on Aug 15 2018 9:17 PM

టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పై వైఎస్సార్ సీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రెహ్మమాన్ మండిపడ్డారు.

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పై వైఎస్సార్ సీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర కన్వీనర్ రెహ్మమాన్ మండిపడ్డారు. హైదరాబాద్ నగరం కేసీఆర్ అబ్బసొత్తు కాదని ఆయన దుయ్యబట్టారు. హైదరాబాద్ తన సొంత ఆస్తిలా మాట్లాడుతున్న కేసీఆర్ ప్రజలను భయభ్రాంతుకు గురిచేస్తున్నారని రెహమాన్ తెలిపారు. 'హైదరాబాద్ కు అర్ధరాత్రి అయినా సరే రండి. మీ సెక్యూరిటీ మేం చూసుకుంటాం' అని ఆయన తెలిపారు.

 

హైదరాబాద్ మాది అంటూ కేసీఆర్ పదేపదే మాట్లాడటంపై రెహమాన్ ధ్వజమెత్తారు. హైదరాబాద్‌పై మెలికలు పెట్టి కిరికిరి చేయాలనుకుంటే రణరంగమే అవుతుందని టీఆర్‌ఎస్ గతంలో హెచ్చరించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement