తప్పుడు ప్రచారాలు చేస్తే ఖబడ్దార్‌! | YSRCP MLA Maheedhar Reddy Fires On Yellow Media | Sakshi
Sakshi News home page

‘పార్టీ ఐక్యతను దెబ్బతీసే కుట్రలను తిప్పి కొడతాం’

Jun 8 2020 3:12 PM | Updated on Jun 8 2020 3:12 PM

YSRCP MLA Maheedhar Reddy Fires On Yellow Media - Sakshi

సాక్షి, ప్రకాశం: తప్పుడు రాతల పై  వైఎస్సార్‌సీపీ కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్  రెడ్డి ఫైర్ అయ్యారు. ఏడాది పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతున్న ప్రభుత్వంపై తప్పుడు రాతలు రాస్తే సహించేది లేదని ధ్వజమెత్తారు. సోమవారం జిల్లాలో ఆయన మాట్లాడుతూ, దిగజారుడు రాతలు రాస్తే ఆ పత్రికల యాజమాన్యాల సంగతి తెలుస్తామని హెచ్చరించారు. ఎల్లో మీడియాపై ఆయన విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చంచాగిరి చేసే వాళ్లు హద్దు మీరితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అసమ్మతి అంటూ తమ పార్టీ ఐక్యతను, విశ్వాసాన్ని దెబ్బతీసే కుట్రలను తిప్పికొడతాం అన్నారు. అవసరమైతే ఈ కుట్రలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటం చేస్తామని మహాధర్‌ రెడ్డి ఎల్లోమీడియాపై నిప్పులు చెరిగారు. (డబ్బా కొట్టి, పత్తా లేకుండా పోయారు!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement