
వైఎస్సార్‌సీపీ నేతలకు బాధ్యతలు అప్పగింత
తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులకు కొత్త బాధ్యతలు ...
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులకు కొత్త బాధ్యతలు అప్పగించినట్లు వైఎస్సార్‌సీపీ తెలిపింది. ఈమేరకు ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. నియామకాలు ఇలా.. సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యునిగా నేదురుమల్లి పద్మనాభరెడ్డి (నెల్లూరు జిల్లా), నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పర్యవేక్షకునిగా పేరిరెడ్డి(గుంటూరు జిల్లా), రాష్ట్ర కార్యదర్శులుగా డి.యుగంధర్ (కర్నూలు జిల్లా), టి.హనిమిరెడ్డి (గుంటూరు జిల్లా), ఎస్.అశోక్ (తూర్పు గోదావరి జిల్లా),మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా తాతినేని పద్మావతి (కృష్ణా జిల్లా), కాటసాని జ్యోతి (కర్నూలు జిల్లా), రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వి.అరవిందనాథ్‌రెడ్డి (వైఎస్సార్ జిల్లా),యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎస్.పరీక్షిత్‌రాజు (విజయనగరం జిల్లా),రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా కర్రి నారాయణరావు (తూర్పుగోదావరి జిల్లా), ఎ.విద్యానాథ్‌రెడ్డి (చిత్తూరు జిల్లా) నిమ్మకాయల సుధాకరరెడ్డి (వైఎస్సార్ జిల్లా)లు నియమితులయ్యారు.