breaking news
New responsibilities
-
ఈ-కామర్స్ సంస్థలకు కొత్త బాధ్యతలు: కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ: విక్రేతల మోసాలకు కూడా ఈ - కామర్స్ సంస్థలను బాధ్యులుగా చేసే దిశగా నిబంధనలను కఠినతరం చేయడంపై కేంద్రం దృష్టి సారించింది. వాటిలో జవాబుదారీతనాన్ని మరింతగా పెంచేలా రూల్స్‌ను రూపొందించడంపై వినియోగదారుల వ్యవహారాల శాఖ కసరత్తు చేస్తోంది. ఇందుకు సంబంధించి, మధ్యవర్తిత్వ సంస్థలుగా అవి పోషిస్తున్న పాత్ర గురించి తెలియజేయాలంటూ కొన్ని ప్రశ్నలను ఈ-కామర్స్ కంపెనీలకు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ పంపించింది. వాటికి సమాధానాలు వచ్చిన తర్వాత మార్గదర్శకాల రూపకల్పన ప్రారంభమవుతుందని వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు సాధారణంగా విక్రేతలు, కొనుగోలుదారులను అనుసంధానించే మధ్యవర్తిత్వ సంస్థలుగా వ్యవహరిస్తున్నాయి. వీటికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని సెక్షన్ 79 ప్రకారం నిర్దిష్ట బాధ్యతల నుంచి కొన్ని మినహాయింపులు ఉంటున్నాయి. అయితే, ప్రతిపాదిత మార్పుల ప్రకారం దాన్ని మార్చి, మధ్యవర్తిత్వ సంస్థలుగా వాటికి మరింత జవాబుదారీతనాన్ని కట్టబెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. డిజిటల్ ఎకానమీలో వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేలా ఈ-కామర్స్ నిబంధనలను పునర్వ్యవస్థీకరించే ప్రక్రియ చేపట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌లలో విక్రయించే ఉత్పత్తులు లోపభూయిష్టంగా ఉన్నట్లు తేలితే.. ఆయా ఈ-కామర్స్ సంస్థలనే బాధ్యులను చేయాలని భావిస్తున్నట్లు వివరించాయి. ఈ-కామర్స్ సంస్థలో నమోదు చేసుకున్న విక్రేత నిర్లక్ష్యంగా వ్యవహరించి, వినియోగదారులు ఆర్డరు చేసిన ఉత్పత్తులు లేదా సర్వీసులను అందించడంలో విఫలమైనా సదరు ఆన్లైన్ షాపింగ్ సంస్థే బాధ్యత వహించేలా నిబంధనలు ఉండవచ్చని పేర్కొన్నాయి. -
ఉమెన్ గ్రూప్ 1
నవ్యాంధ్ర తొలి డీఎస్పీ బ్యాచ్‌లోని 25 మందిలో 12 మంది మహిళలు చోటు దక్కించుకుని కొత్త చరిత్ర సృష్టించిన సందర్భం ఇది. వీరంతా ఇప్పుడు విధులకు సిద్ధం అవుతున్నారు. సమాజానికి రక్షణ కవచంగా యూనిఫామ్ ధరించబోతున్నారు. చట్టం, న్యాయం, ధర్మానికి ప్రతీక అయిన మూడు సింహాలతో కలిసి కర్తవ్య నిర్వహణ నాలుగో సింహంగా కొత్త బాధ్యతలు చేపట్టనున్నాను. కరకు ఖాకీ వృత్తి మగవాళ్లకే పరిమితమన్న వాదనకు చెల్లుచీటి రాస్తూ ‘మేము సైతం’ అంటూ సత్తా చాటేందుకు సంసిద్ధులయ్యారు. ఉన్నత చదువులతో ఉన్నత లక్ష్యాలవైపు అడుగులు వేసిన ఈ మహిళా డీఎస్పీలు మహిళావనికే ఆదర్శం. ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ చదువులు పూర్తి చేసిన ఈ పన్నెండు మందీ ఏదో బతుకుదెరువు కోసం ఉద్యోగం చేయాలనే నిర్ణయానికి పరిమితం కాలేదు. జాతీయ స్థాయిలో గుర్తింపు కలిగిన సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షలకు బరిలో దిగారు. ఢిల్లీ, హైదరాబాద్‌లలోని ఐఏఎస్ అకాడమీల్లో రేయింబవళ్లు విరామమెరుగకుండా శ్రమించారు. సివిల్స్ పరీక్షలకు సిద్ధమైన వీరంతా.. అంతకంటే ముందుగా వచ్చిన గ్రూప్–1 పరీక్ష రాశారు. విశేషం ఏమిటంటే ఉన్నతమైన సివిల్స్‌కు కోచింగ్ తీసుకున్న వారు గ్రూప్–1 పోటీ పరీక్షలకు ప్రత్యేకంగా ఎటువంటి కోచింగూ లేకుండానే నెగ్గుకొచ్చారు. సివిల్స్ కొట్టాలనుకుని గ్రూప్–1కు ఎంపికై డీఎస్పీ పోస్టును సాధించిన వారిలో కొందరు మాత్రం ఏమైనా సివిల్స్‌కు వెళ్తామంటున్నారు. పోలీసు ఉద్యోగంతో సమాజానికి నేరుగా సేవ చేసే భాగ్యం దక్కిందని మరికొందరు ఇక్కడికే పరిమితమవుతున్నారు. వీరిలో కొందరిని సా„ì పలకరించింది. వారి మనోభావాలను తెలుసుకుంది. యూనిఫాం చూసుకుని గర్వపడుతున్నా ఖాకీ యూనిఫాం వేసుకోవడానికి చాలా గర్వంగా ఫీలవుతున్నాను. నేను బీటెక్ చదివాను. గ్రూప్–1లో డీఎస్పీగా ఎంపిక కావడాన్ని ఎప్పటిక మరిచిపోలేను. నా తల్లిదండ్రులు లలిత, ఎస్ఏ బషీర్, నా భర్త షఫీ, నా మావయ్య వన్నూర్ సాహెబ్ (రిటైర్డ్ ఏఎస్పీ) అందించిన ప్రోత్సాహం మరువలేను. వృత్తిపరంగా ప్రతీ రోజు నేను వేసుకున్న ఖాకీ యూనిఫాంకు న్యాయం చేసేలా పనిచేస్తాను. ఒక పోలీసుగా గర్వంగా ఫీలయ్యేలా సమాజానికి సేవ చేస్తాను. వ్యక్తిగతంగా మంచి కూతురు, మంచి తల్లి అన్పించుకునేలా ఉంటాను. –షేక్ షాను,రేణిగుంట, చిత్తూరు జిల్లా సివిల్ సర్వీసెస్ నా టార్గెట్ డీఎస్పీగా పనిచేస్తూ సివిల్ సర్వీసెస్‌లో రాణించాలన్నదే నా ముందున్న లక్ష్యం. నేను తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేయడంతోపాటు గోల్డ్‌మెడల్ సా«ధించాను. స్టేట్ బ్యాంక్ ఇఫ్ ఇండియా, ఏపీజెన్‌కోలో ఉద్యోగం చేశాను. సివిల్స్ సాధించాలనే నా పట్టుదలను చూసి నా తల్లిదండ్రులు ఎన్.చంద్రశేఖర్, బీవీ ఉమ, నా భర్త పీవీ రాఘవ నన్ను ప్రోత్సహించారు. నాకు రెండేళ్ల కూతురు హంసిక ఉంది. ఒకవైపు కుటుంబాన్ని చూసుకుంటూ మరోవైపు డీఎస్పీ విధులు నిర్వర్తిస్తూ, అదే సమయంలో సివిల్స్ పై దృష్టి పెట్టి సాధిస్తాను. – ఎన్.రమ్య, తిరుపతి బాధితులకు న్యాయం జరిగేలా పనిచేస్తాను అనంతపురం జేఎన్టీయూలో కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. మా నాన్న ఎస్ఎం రమేష్‌చంద్ర రిటైర్డ్ డీఈఈ. అమ్మ ఎం.అనుపమ అనంతపురం కలెక్టరేట్లో తహíసీల్దార్‌గా పనిచేస్తోంది. ఒక సోదరి కోటచెరువు మండలంలో డిప్యూటీ తహíసీల్దార్‌గా పనిచేస్తోంది. మరో సోదరి సుస్మిత ఫ్యాషన్ మేనేజ్మెంట్ పూర్తి చేసింది. డీఎస్పీగా విధుల్లో చేరిన నేను ఒక పోలీసుగా బాధితులకు న్యాయం చేసేలా పనిచేస్తాను. ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై ప్రధానంగా దృష్టి సారిస్తాను. – ఎస్.రమేష్ చంద్ర హర్షిత, అనంతపురం మా నాన్న జడ్జి కావడంతో.. నాకు పోలీస్ కావాలని ఉండేది మా నాన్న గాంధీ.. డిస్టిక్ట్ర్ అండ్ సెషన్స్ జడ్జి (హైదరాబాద్) కావడంతో ఆయన ప్రభావం నాపై ఉండేది. ఆయన నిత్యం కేసులు, విచారణలో బిజీగా ఉండటం చూసి నేను పోలీసు కావాలని అనుకునేదాన్ని. బీటెక్ పూర్తి చేసి, ఖాళీగా ఉండటం ఎందుకని ఐడియా సెల్యులార్ సర్వీసెస్ (హైదరాబాద్)లో కొంతకాలం జాబ్ చేశాను. సివిల్స్ సాధించాలని ఇటీవల ఢిల్లీ వెళ్లి కోచింగ్ తీసుకున్నాను. ఈ మధ్యలో గ్రూప్–1 పరీక్ష రాసి డీఎస్పీ సాధించాను. పోలీసు ఉద్యోగం అంటే ఇష్టపడే నేను నేరుగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న ఈ వృత్తిని వదులుకోను. అవకాశం ఉన్నంత మేరకు ప్రజలకు పోలీసు సేవలను అందించాలన్నదే నా లక్ష్యం. మహిళలు, చిన్నారులు, అట్టడుగు వర్గాల రక్షణ కోసం పనిచేస్తాను. – ఎం.శ్రావణి, కొవ్వూరు, పశ్చిమగోదావరి మా మండలంలో నాదే రికార్డు మా నాన్న గురుప్రసాద్ సాధారణ రైతు. మా అమ్మ లక్ష్మీదేవి గృహిణి. ఆడపిల్లనైనా నన్ను ఎంతో కష్టపడి చదివించారు. ఇంజనీరింగ్ పూర్తి చేసి 2016–2018 మధ్య భారత ఆహార సంస్థ(ఎఫ్‌సీఐ)లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం చేశాను. సివిల్స్ సాధించాలనే తపనతో హైదరాబాద్ వెళ్లి కోచింగ్ తీసుకున్నాను. గ్రూప్–1 సా«ధించి డీఎస్పీగా ఎంపికయ్యాను. మా ఓబులావారి మండలం మొత్తం మీద నేరుగా(డైరెక్ట్) గ్రూప్–1 సాధించిన ఘనత నాదే కావడం గర్వంగా ఉంది. ప్రజల సమస్యలు కళ్లారా చూసి వారికి న్యాయం చేసే అవకాశం ఉన్న పోలీసు అధికారిగా నా బాధ్యతను సక్రమంగా నిర్వహించాలనే ఆశయంతో ముందుకు సాగుతాను. – ఎం.శ్రీలత, ఇందిరానగర్, వైఎస్సార్ కడప జిల్లా నాన్నే నాకు స్ఫూర్తి తిరుపతిలో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శ్యామ్ సుందరం మా నాన్న. పోలీసుగా ఆయనను దగ్గర నుంచి చూసిన నాకు పోలీసు కావాలనే లక్ష్యం ఉండేది. నేను డీఎస్పీగా ఎంపిక కావడానికి నాన్నే నాకు స్ఫూర్తిగా నిలిచారు. అమ్మ సునీత వినోదిని గృహిణిగా ఉంటూ నన్ను చదువులో ప్రోత్సహించేది. బీటెక్‌లో నేను గోల్డ్‌మెడల్ సాధించాను. సివిల్స్ సర్వీసెస్‌ను టార్గెట్‌గా పెట్టుకుని హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకున్నాను. ఈలోపు గ్రూప్–1 రాసి డీఎస్పీ పోస్టు సాధించాను. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది. అయినా ఇక్కడితో ఆగిపోను. డీఎస్పీగా పనిచేస్తూ సివిల్స్ కొడతాను. ఐఏఎస్, ఐపీఎస్‌లలో ఏదో ఒకటి సాధిస్తాను. పాజిటివ్‌గా పనిచేస్తే ప్రజలకు మరింత చేరువ అయ్యే అవకాశం పోలీసులకే ఉంది. నేరుగా ప్రజలకు సేవ చేసే అవకాశం ఉన్న పోలీసు వృత్తి నాకు చాలా ఇష్టం. – ఇ.జెస్సీ ప్రశాంతి, తిరుపతి ప్రభుత్వ సర్వీసులో చేరాలన్నకోరిక నెరవేరింది ప్రభుత్వ సర్వీసులో చేరి ప్రజలకు సేవ చేయాలన్న నా లక్ష్యం నెరవేరింది. నేను డీఎస్పీ పోస్టు సాధించడంలో అమ్మా, నాన్న ప్రోత్సాహం ఎంతో ఉంది. గుంటూరు జిల్లా చిలకలూరిపేట సొంత ప్రాంతమైనప్పటికీ అమ్మా, నాన్నలకు ఉద్యోగరీత్యా తిరుపతిలో ఉంటున్నాం. నాన్న డాక్టర్ ఎస్.కిషోర్ శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ(తిరుపతి)లో ప్రొఫెసర్. అమ్మ కేఎం రోజ్మండ్ నెల్లూరులో డిప్యూటీ కలెక్టర్. వారి స్ఫూర్తితో ప్రభుత్వ ఉద్యోగం చేయాలనే లక్ష్యంతో పట్టుదలగా సాధించాను. – ఎస్.భవ్య కిషోర్, చిలకలూరిపేట, గుంటూరు జిల్లా డీఎస్పీగా ఎక్కువ సేవలు అందించాలనుకున్నా.. మా నాన్న ధర్మరాయ్ ఆంధ్రా యూనివర్సిటీలో ఫార్మసిస్టు. మా అమ్మ అప్పల నర్సమ్మ మున్సిపల్ స్కూల్ టీచర్. వారి ప్రోత్సాహంతోనే నేను రాణించాను. నేను ఎంబీబీఎస్ పూర్తి చేశాను. అయితే ప్రజలకు విస్తృతంగా అందు బాటులో ఉండటానికి డీఎస్పీ అవడం అవసరం అనుకున్నాను. పోలీసు అధికారిగా వీలైనంత ఎక్కువ మంది ప్రజలకు మేలైన సేవలు చేయాలన్నది నా సంకల్పం. –కె.స్రవంతి రాయ్, తురైగూడ, అరకు మండలం, విశాఖ 2018–19 బ్యాచ్ మహిళా డీఎస్పీలు ఎస్.రమేష్‌చంద్ర హర్షిత, ఎం.శ్రావణి, షేక్ షాను, ఎం. శ్రీలత,కె. లతకుమారి, ఎం. నాగ భార్గవి, ఎస్. శిరీషా, కె. స్రవంతిరాయ్, ఇ.జెస్సీ ప్రశాంతి, ఎస్. భవ్యకిషోర్, వై. శృతి, ఎన్. రమ్య – ఇరింకి ఉమామహేశ్వరరావు, సాక్షి, అమరావతి ఫొటోలు: పి. విజయ్ కృష్ణ -
డీలర్లకు కొత్త బాధ్యతలు
అనంతపురం అర్బ¯ŒS : చౌక దుకాణ డీలర్ల సేవలను ప్రభుత్వం విస్తృతం చేయాలని నిర్ణయించింది. ఇన్నాళ్లూ కేవలం లబ్ధిదారులకు సరుకులను మాత్రమే డీలర్లు అంది ంచేవారు. అయితే ఇప్పుడు బ్యాంకులకు బిజినెస్ కరస్పాండెంట్లు(బీసీ)గా కూడా వారు పనిచేయనున్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ద్వారా వారిని నియమించాలని ఈనెల 15న ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆ దిశగా కలెక్టర్ కోన శశిధర్ చర్యలు చేపట్టారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ (డీఎల్‌బీసీ) సమావేశం నిర్వహించేందుకు ముందే ఆర్డీఓలు, తహశీల్దారులు తమ పరిధిలోని డీలర్లకు ఇందుకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ప్రతి చోట ఈ సమావేశం బుధవారం జరగాలని సూచించారు. బిజినెస్ కరస్పాండెంట్లుగా తీసుకునేందుకు ఉన్న నియమాలను డీలర్లకు తెలియజేసేందుకు డీఎల్‌బీసీ, నియమించుకునే బ్యాంకులకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. డీలర్లు ఏమి చేస్తారంటే... బ్యాంకులకు బిజినెస్ కరస్పాండెంట్లుగా ఉండే డీలర్లు బ్యాంక్ ఏజెంట్లుగా వ్యవహరిస్తూ తమ పరిధిలో ప్రాంతంలో బ్యాకింగ్ కార్యకలాపాలు సాగిస్తారు. బ్యాంకులకు ప్రజలు చెల్లించాల్సిన రుణాలను స్వీకరించడం వాటిని బ్యాంకుల్లో జమ చేయడం. రుణం తీసుకోవాలనుకునేవారికి అవసరమైన ఫారాలు ఇవ్వడం, నిబంధనలు వివరించడం వంటి కార్యకలాపాలను బిజినెస్ కరస్పాండెంట్లు తెలియజేస్తారు. ఖాతాదారులకు , బ్యాంకులకు మధ్యవర్తులుగా వీరు వ్యవహరిస్తారు. బ్యాంకుల నియమ, నిబంధనల మేరకు వీరికి కమీష¯ŒS అందించనున్నారు. -
వైఎస్సార్సీపీ నేతలకు బాధ్యతలు అప్పగింత
-
వైఎస్సార్సీపీ నేతలకు బాధ్యతలు అప్పగింత
హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ ఆంధ్రప్రదేశ్ నాయకులకు కొత్త బాధ్యతలు అప్పగించినట్లు వైఎస్సార్సీపీ తెలిపింది. ఈమేరకు ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. నియామకాలు ఇలా.. సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యునిగా నేదురుమల్లి పద్మనాభరెడ్డి (నెల్లూరు జిల్లా), నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పర్యవేక్షకునిగా పేరిరెడ్డి(గుంటూరు జిల్లా), రాష్ట్ర కార్యదర్శులుగా డి.యుగంధర్ (కర్నూలు జిల్లా), టి.హనిమిరెడ్డి (గుంటూరు జిల్లా), ఎస్.అశోక్ (తూర్పు గోదావరి జిల్లా),మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా తాతినేని పద్మావతి (కృష్ణా జిల్లా), కాటసాని జ్యోతి (కర్నూలు జిల్లా), రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వి.అరవిందనాథ్‌రెడ్డి (వైఎస్సార్ జిల్లా),యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎస్.పరీక్షిత్‌రాజు (విజయనగరం జిల్లా),రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా కర్రి నారాయణరావు (తూర్పుగోదావరి జిల్లా), ఎ.విద్యానాథ్‌రెడ్డి (చిత్తూరు జిల్లా) నిమ్మకాయల సుధాకరరెడ్డి (వైఎస్సార్ జిల్లా)లు నియమితులయ్యారు. -
అశ్వినికి పాస్‌పోర్ట్ ఉద్యోగుల అభినందనలు
హైదరాబాద్: హైదరాబాద్ పాస్‌పోర్ట్ అధికారిగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సత్తారు అశ్వినికి పాస్‌పోర్ట్ ఉద్యోగుల సంఘం అభినందనలు తెలిపింది. అభినందనలు తెలిపిన వారిలో డిప్యూటీ పాస్‌పోర్ట్ అధికారి సాబిర్ ఆలీ, వనజ, డా.ఎ.శిరీష్‌లు ఉన్నారు. మూడున్నరేళ్లు పాస్‌పోర్ట్ అధికారిగా పనిచేసిన శ్రీకర్‌రెడ్డి జెనీవాలోని ప్రపంచ వాణిజ్య కేంద్రానికి బదిలీ అయిన విషయం విదితమే.