సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా ఆ పార్టీ నాయకు లు చేస్తున్న నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
చోడవరం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్ మోహన్‌రెడ్డి దీక్షకు మద్దతుగా ఆ పార్టీ నాయకు లు చేస్తున్న నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్ష చేస్తున్న ఆ పార్టీ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడు పి.వి.ఎస్. ఎన్.రాజు తో పాటు మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఎం.ముత్యాలనాయుడు, రోలుగుం ట మాజీ వైస్ ఎంపీపీ యర్రంశెట్టి శ్రీనివాసరావు చేపట్టిన దీక్ష శుక్రవారం నాలుగో రోజుకు చేరుకుంది.
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాసరావు వీరికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, సుగర్ లెవెల్స్ బాగా తగ్గిపోవడంతో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వెంటనే వైద్యం అందించాలని చెప్పా రు. దీంతో సీఐ ఎ.విశ్వేశ్వరరావు, ఎస్‌ఐ శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలు ఒక్కసారిగా దీక్షా శిబిరాన్ని చుట్టుము ట్టాయి. ఆరోగ్య సమస్య ఉత్పన్నమైనందున వెంటనే దీక్ష నిలిపివేయాలని దీక్షల్లో పాల్గొన్న వారిని సీఐ కోరారు. వారు నిరాకరించడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల నిరసనల మధ్య బలవంతంగా 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.
పోలీసు అధికారులు వారికి బలవంతంగా వైద్యం చేయించి, నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు.యలమంచిలి నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు అక్కడకు చేరుకుని వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది కాండ్రేగుల డేవిడ్, చిమ్మినాయుడు తదితరులు వారిని పరామర్శించారు. తెలిపారు.