'జగన్పై బురదజల్లడమే ఎల్లో మీడియా పని' | YSRCP leader Rehman takes on Yellow media | Sakshi
Sakshi News home page

'జగన్పై బురదజల్లడమే ఎల్లో మీడియా పని'

Feb 2 2014 3:21 PM | Updated on May 29 2018 4:09 PM

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురదజల్లడం తప్ప ఎల్లో మీడియాకు మరోపనిలేదని ఆ పార్టీ నేత రెహ్మాన్ విమర్శించారు.

కడప: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై బురదజల్లడం తప్ప ఎల్లో మీడియాకు మరోపనిలేదని ఆ పార్టీ నేత రెహ్మాన్ విమర్శించారు. ప్రజల్లో జగన్కున్న ఆదరణను చూసి ఓర్వలేక కట్టుకథనాలను అల్లుతోందని ఆరోపించారు. వైఎస్ఆర్ సీపీ ప్లీనరీకి తెలంగాణ ప్రాంతం నుంచి వేలాదిమంది కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారని రెహ్మాన్ అన్నారు. హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రుల ఆస్తులకు తాము రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. హైదరాబాద్ ఏమీ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర్ రావు సొత్తు కాదని, అందరిదీనని రెహ్మాన్ అన్నారు.

ఇడుపులపాయలో ఆదివారం నిర్వహించిన వైఎస్ఆర్ సీపీ ప్లీనరీ ఘనంగా జరిగింది. జగన్తో పాటు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, సోదరి షర్మిల, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్లీనర్ ప్రసంగించిన జగన్.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఉచిత విద్యుత్, ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement