అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే... తాట తీస్తా..!

YSR Kadapa SP Abhishek Mahanti Instructions To The Parties - Sakshi

 జిల్లా ఎస్పీ అభిషేక్‌ మహంతి హెచ్చరిక  

సాక్షి, కడప అర్బన్‌: ఎన్నికల నిర్వహణలో అప్రజాస్వామికంగా వ్యవహరించినా, విఘాతం కలిగించినా తాట తీస్తామని ఎస్పీ అభిషేక్‌ మహంతి హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా గురువారం ఎన్నికలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టామనీ  ఆయన పేర్కొన్నారు.  ప్రజలకు, వివిధ పార్టీల నేతలకు, ఏజెంట్లకు సూచనలు చేశారు.

  • అభ్యర్థులు, ఏజెంట్లు, ఓటర్లు గానీ వాహనాలు కాన్వాయ్‌గా రాకూడదన్నారు. అనుమతించిన వాహనాలలోనే విడివిడిగా వెళ్లాలన్నారు. 
  • పోలింగ్‌ స్టేషన్‌ల వద్ద, ఇతర ప్రదేశాలకుగానీ గుంపులుగా ఉండరాదు. 
  • ఓటరును భయపెట్టరాదు. ప్రలోభాలకు గురి చేయరాదు. 
  • ఓటర్లను వాహనాల్లో తరలించరాదు. ఇతర సౌకర్యాలైన భోజనం, వగైరా వసతులను కల్పించరాదన్నారు. అలా చేస్తే వాహనాలు, వస్తువులను సీజ్‌ చేయడంతో పాటు చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామనీ హెచ్చరించారు. 
  • జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు 18వేల మందిని బైండోవర్‌ చేశారు. 
  • అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎన్నికల ప్రక్రియను ఎప్పటికపుడు చిత్రీకరించనున్నారు. 
  • దాదాపు 6 వేల మంది పోలీసు సిబ్బందిబందోబస్తులో పాల్గొంటున్నారు. సిఆర్‌పీఎఫ్, ఐఆర్‌బీ, కేరళ, కర్నాటక నుంచి వచ్చిన ప్రత్యేక బలగాలు పోలింగ్‌ స్టేషన్‌ వద్ద బందోబస్తులో పాల్గొంటాయి. పోలింగ్‌ ప్రక్రియకు విఘాతం కల్గించే వ్యక్తులపై, వారికి మద్దతు ఇచ్చే అభ్యర్థులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు.  
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top