ప్రొద్దుటూరులో టీడీపీ నేతల రభస | ysr district: High Tension Prevails at Proddatur | Sakshi
Sakshi News home page

ప్రొద్దుటూరులో టీడీపీ నేతల రభస

Apr 16 2017 11:33 AM | Updated on Oct 16 2018 6:15 PM

ప్రొద్దుటూరులో టీడీపీ నేతల రభస - Sakshi

ప్రొద్దుటూరులో టీడీపీ నేతల రభస

మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా ఆదివారం ప్రొద్దుటూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది.

ప్రొద్దుటూరు: మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా ఆదివారం ప్రొద్దుటూరు మున్సిపల్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. శనివారం టీడీపీ నేతల దౌర్జన్యంతో ఎన్నిక వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే.. ఓటమి భయంతో ఉన్న టీడీపీ నేతలు ఇవాళ కూడా ఎన్నికలకు అడ్డంకులు సృష్టించేలా వ్యవహరిస్తున్నారు.

మున్సిపల్‌ కార్యాలయంలోకి ప్రవేశించడానికి వరదరాజులురెడ్డి వర్గీయులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో తీవ్ర రభస ఏర్పడింది. ఓ దశలో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. 40 మంది కౌన్సిలర్‌లలో వైఎస్‌ఆర్సీసీపీ నుంచి బరిలో ఉన్న ముక్తియార్‌కు 24 మంది మద్దతు ఉంది. దీంతో టీడీపీ నేతలు మరోసారి ఎన్నికను అడ్డుకోవడానికి కుట్రలు పన్నుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement