రేపు వైఎస్ఆర్ సీపీ ఎల్పీ సమావేశం

రేపు వైఎస్ఆర్ సీపీ ఎల్పీ సమావేశం - Sakshi


హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు బుధవారం సమావేశం కానున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు లోటస్‌పాండ్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం ప్రారంభంకానుంది. గురువారం నుంచి ప్రారంభమైయ్యే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలతో వైఎస్‌ జగన్ చర్చించనున్నారు.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాల్ని ఈ నెల 19వ తేదీ గురువారం ఉదయం 11:34 నిమిషాలకు ప్రారంభించాలని నిశ్చయించారు. ఆరోజు ఉదయాన్నే విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top