వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు.
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మాజీ ఎమ్మెల్యే దొడ్డా బాలకోటిరెడ్డి నాలుగో వర్థంతి పురస్కరించుకుని నాదెండ్ల మండలం చిరుమామిళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించనున్నారు. అప్పట్లో దొడ్డా బాలకోటిరెడ్డి విగ్రహాన్ని వైఎస్ జగన్ చేతుల మీదగా ఆవిష్కరించాలన్న గ్రామస్తుల కోరిక ఈ నెల 11న నెరవేరనుంది. మధ్యాహ్నం 3 గంటలకు విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.