
'ఒక్క వాగ్దానాన్నీ అమలుచేయని సర్కారు'
చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు.
చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో ఏ ఒక్క వాగ్దానాన్నీ అమలు చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ప్రభుత్వంపై సమరశంఖం పూరించేందుకే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 'సమరదీక్ష' చేపడుతున్నారని ఆయన చెప్పారు.
'సమరదీక్ష' పోస్టర్ను ఆయనతో పాటు పలువురు సీనియర్ నేతలు కలిసి హైదరాబాద్లో శుక్రవారం విడుదల చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద జూన్ 3, 4 తేదీలలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమరదీక్ష చేస్తున్నారని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసగించారని ఆయన మండిపడ్డారు.