జగన్ సమైక్య శంఖారావం మరో 2 రోజులు వాయిదా | YS Jagan Mohan Reddy Samaikya Shankaravam postponed for two days | Sakshi
Sakshi News home page

జగన్ సమైక్య శంఖారావం మరో 2 రోజులు వాయిదా

Jan 18 2014 3:57 AM | Updated on Aug 13 2018 3:11 PM

జగన్ సమైక్య శంఖారావం మరో 2 రోజులు వాయిదా - Sakshi

జగన్ సమైక్య శంఖారావం మరో 2 రోజులు వాయిదా

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మెడనొప్పి తగ్గకపోవడంతో సమైక్య శంఖారావం యాత్ర మరో రెండు రోజులు వాయిదా పడింది.

* రెండు రోజుల విశ్రాంతి అవసరమన్న వైద్యులు
* 20 నుంచి నగరిలో పునఃప్రారంభం
 
సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మెడనొప్పి తగ్గకపోవడంతో సమైక్య శంఖారావం యాత్ర మరో రెండు రోజులు వాయిదా పడింది. నొప్పి కారణంగా ఇప్పటికే ఆయన తన యాత్రను ఈ నెల 18కి వాయిదా వేసుకున్న విషయం విదితమే. శుక్రవారం మధ్యాహ్నం జగన్‌ను పరీక్షించిన అపోలో ఆసుపత్రి వైద్యులు మరో రెండు రోజులపాటు పూర్తి విశ్రాంతి అవసరమని సలహా ఇచ్చారు.

దీంతో ఈ నెల 20న చిత్తూరు జిల్లా నగరి నుంచి యాత్ర పునఃప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. 20వ తేదీ ఉదయం జగన్ హైదరాబాద్ నుంచి తిరుపతికి విమానంలో బయలుదేరి వెళ్లి నగరి నియోజకవర్గంలో యాత్రను పునఃప్రారంభిస్తారని పార్టీ కార్యక్రమాల కోఆర్డినేటర్ తలశిల రఘురామ్ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement