
సాక్షి, అనపర్తి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. మామిడాలలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జననేత పాదయాత్ర ప్రారంభం కాలేదు. జోరుగా వాన కురుస్తున్నా రాజన్న బిడ్డను చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. తనను చూడటానికి వచ్చిన వారిని ఆయన వర్షంలోను మాట్లాడుతూ సమస్యలను తెలుసుకుంటున్నారు. ఆదివారం ఉదయం పెద్దపూడి మండలం మామిడాల నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది. వర్షం నుంచి ఉపశమనం లభించిన అనంతరం పాదయాత్ర ప్రారంభం అవుతుందని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రాఘురాం ఒక ప్రకటనలో తెలిపారు.