
సాక్షి, అనపర్తి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 213వ రోజు ప్రారంభమైంది. ఆదివారం వర్షం కారణంగా రద్దైన పాదయాత్ర నేడు కొనసాగనుంది. సోమవారం ఉదయం వైఎస్ జగన్ పెద్దపూడి మండలం మామిడాల శివారు నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అక్కడి నుంచి పెద్దడ, కికవోలు, పెద్దపూడి, దొమ్మాడ మీదుగా కరుకుడురు వరకు పాదయాత్ర కొనసాగనుంది.
ఆదివారం రోజు వర్షం పడుతున్నా రాజన్న బిడ్డను చూడటానికి పెద్ద ఎత్తున ప్రజలకు క్యాంపుకు వద్దకు చేరుకున్నారు. జోరు వానలోను జననేత తనకోసం వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. కష్టం వస్తే నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఇక పాదయాత్రలో రాజన్న బిడ్డకు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు.