బనగానపల్లె నుంచి ప్రజాసంకల్పయాత్ర

YS jagan 13th Day of PrajaSankalpaYatra begin - Sakshi - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, బనగానపల్లి (కర్నూలు జిల్లా) : ప్రజాసమస్యలు తెలుసుకునేందుకు, ప్రజలతో మమేకమయ్యేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 13వ రోజుకు చేరుకుంది. సోమవారం ఉదయం ఆయన బనగానపల్లి నుంచి పాదయాత్రను ప్రారంభించారు. బాతులూరుపాడు, ఎన్నకొండల మీదుగా ఉదయం 10.30 గంటలకు హుస్సైనపురం చేరుకుంటారు. హుస్సైనపురం చేరుకొనే ముందు మహిళ సదస్సులో పాల్గొంటారు.

అనంతరం హుస్సైనపురంలో పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మూడు గంటల సమయంలో హుస్సైనపురం నుంచి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. పాలుకూరు క్రాస్‌రోడ్డు, గోవిందదిన్నెల మీదుగా డోన్‌ నియోజకవర్గంలోకి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ప్రవేశిస్తుంది. బేతంచర్ల మండలం గోర్లగుట్ట వద్ద వైఎస్‌ జగన్‌కు డోన్‌ నియోజకవర్గ పార్టీ నేతలు, ప్రజలు ఘనస్వాగతం పలుకుతారు. సాయంత్రం 5.30 గంటలకు ఆయన గోర్లగుట్టలో క్వారీ కార్మికులతో మాట్లాడతారు. రాత్రి 7.30 గంటలకు పాదయాత్ర ముగుస్తుంది. రాత్రికి వైఎస్‌ జగన్‌ అక్కడే బస చేస్తారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top