పార్లమెంటు స్టాడింగ్‌ కమిటీల్లో ఎంపీలకు చోటు

YS Avinash Reddy And Mithun Reddy Appointed Parliament Standing Committees - Sakshi

పరిశ్రమలశాఖ వ్యవహారాల కమిటీ సభ్యునిగా వైఎస్‌ అవినాష్‌రెడ్డి

ఆర్థిక వ్యవహారాల కమిటీ సభ్యునిగా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి

సాక్షి, కడప : ప్రత్యేక హోదానే ఎజెండాగా వారిద్దరు పోరాటాలు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన నిలిచారు. అనునిత్యం ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేసిన నేతలుగా గుర్తింపు పొందారు.వారే కడప, రాజంపేట పార్లమెంట్‌ సభ్యులు వైఎస్‌ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి. వీరికి పార్లమెంట్‌ స్టాడింగ్‌ కమిటీల్లో కీలకమైన పదవులు లభించాయి. 

పరిశ్రమలశాఖ వ్యవహారాల పార్లమెంటు స్టాడింగ్‌ కమిటీ సభ్యునిగా కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి...ఆర్థిక వ్యవహారాల కమిటీ సభ్యునిగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిలకు అవకాశం కల్పిస్తూ లోక్‌సభ సెక్రటేరియేట్‌ బులిటిన్‌ విడుదల చేసింది. రాష్ట్రానికి చెందిన పలువురు వైఎస్సార్‌ సీపీ ఎంపీలకు పార్లమెంట్‌ స్టాడింగ్‌ కమిటీలో పదవులను అప్పజెప్పింది. జిల్లాకు సంబంధించిన ఇద్దరు ఎంపీలకు కమిటీల్లో చోటు లభించడంపై పార్టీతోపాటు ఆయా పార్లమెంటు నియోజకవర్గాల్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top