క్రిమినల్ ప్రేమకథ | Sakshi
Sakshi News home page

క్రిమినల్ ప్రేమకథ

Published Fri, Jul 11 2014 1:57 AM

క్రిమినల్ ప్రేమకథ

డెంకాడ: సమాజంలో యువతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధాన ఇతివృత్తంగా క్రిమినల్ ప్రేమకథ చిత్రాన్ని తీస్తున్నామని సినీదర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి చెప్పారు. జొన్నాడ వద్ద ఉన్న లెండి ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం ఏర్పాటు చేసిన  సమావేశంలో  ఆయన మాట్లాడారు. యువతులు సమాజంలో అనేక మంది ఉన్మాదులు, శాడిస్టులు వంటి రకరకాల వ్యక్తులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.
 
 ఇలాంటి అంశాలను ఆధారంగా చేసుకుని, కళాశాలల్లో తాను వెళ్లేటప్పుడు విద్యార్థినుల వద్ద సేకరించిన అంశాలనే ఆధారంగా తీసుకుని క్రిమినల్ ప్రేమకథ సినిమా తీయటం జరిగిందన్నారు. ఈ సినిమాల్లో లెండి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన అనణ్య, ప్రత్యూష, రమణి, కౌషిక్‌లకు పాట పాడే అవకాశం కల్పించామన్నారు. కళాశాల ప్రిన్స్‌పాల్ డాక్టర్ వీవీ రామారెడ్డి మాట్లాడుతూ  లెండి ఇంజినీరింగ్ కళాశాల  విద్యార్థులు అన్ని రంగాల్లో  రాణించటం హర్షనీయమన్నారు. మ్యూజిక్ డెరైక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఆర్తిని ఈ సినిమా పాటల్లో చూపించటం జరుగుతుందన్నారు. సమావేశంలో ఎన్‌ఎస్‌ఎస్ పీఓ టి.హరిబాబు, చిత్ర నటులు మనోజ్, అనిల్, ప్రియాంక, పల్లవి, దివ్య, మనోప్రియ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement