న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ శుక్రవారం తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ ఎదుట దీక్షకు దిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారంజ.
తిరుమలగిరి, న్యూస్‌లైన్: న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ శుక్రవారం తిరుమలగిరి పోలీస్‌స్టేషన్ ఎదుట దీక్షకు దిగింది. బాధితురాలి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారంజ. తిరుమలగిరి మండలం బండ్లపల్లి గ్రామానికి చెందిన మెతుకు అంజయ్య కూతురు వినోదను గుండాల మం డలం వస్తాకొండూర్ గ్రామానికి చెందిన సోమనారాయణకు 15ఏళ్ల క్రితం ఇచ్చి వివాహం జరిపించారు. వీరికి కుమార్తె, కుమారుడు పుట్టిన తరువాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. అక్కడ ఆర్థికస్థితి సరిగా లేకపోవడంతో రెండేళ్లుగా తిరుమలగిరిలో నివసిస్తున్నారు. ఈ క్ర మంలో కొద్ది రోజులుగా వినోదను భర్త, అత్త, మామ, ఆడబిడ్డ, మరిది కలిసి అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు.
దీంతో ఆమె డిసెంబర్ 17న భర్త, కుటుంబ సభ్యులపై తిరుమలగిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పెద్ద మనుషుల సమక్షంలో పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి నా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో కేసు నమోదు చేయాలని పోలీసులను కోరిం ది. అయితే పోలీసులు భర్త, అత్త, మామలపై కేసు పెట్టారని, ఆడబిడ్డ మరిదిపై కేసు ఉపసంహరించారని బాధితురాలు ఆరోపించింది. ఎన్నిసార్లు వారిని అరెస్టు చేయాలని కోరినా ఎస్‌ఐ పట్టించుకోవడం లేదని తెలిపింది.. భర్త సోమనారాయణను మాత్రమే ఈ నెల 2వ తేదీన రిమాండ్‌కు పంపడం, ఇతర కుటుంబ సభ్యులను అరెస్టు చేయక పోవడంతో ఆగ్రహం చేస్తూ వినోద పోలీస్‌స్టేషన్ ఎదుట దీక్ష చేపట్టింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ పోలీసులు.. తన అత్తామామ, ఆడబిడ్డ, మరిదితో కుమ్మకయ్యారని రోదిస్తూ తెలిపిం ది. కాగా, బాధిత మహిళకు న్యాయం చేసి వా రిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని తిరుమలగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ చెవిటి వెంకన్న యాదవ్ కోరారు. శనివారంలోపు అరెస్టు చేయకపోతే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ హరిశ్చంద్రనాయక్, ఉప సర్పంచ్ కత్తుల శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కందుకూరి సోమయ్య, వై.ధీన్‌దయాళ్, మల్లేష్‌నేత, హఫీజ్, సోమయ్య, నరేష్, శ్రీను, ఉప్పలయ్య ఉన్నారు.