
మంత్రులతో చర్చలకు హాజరవుతాం: అశోక్ బాబు
మంత్రివర్గ ఉప సంఘంతో ఆదివారం జరిగే చర్చలకు తాము హాజరు కానున్నట్లు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి చైర్మన్, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు.
మంత్రివర్గ ఉప సంఘంతో ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగే చర్చలకు తాము హాజరు కానున్నట్లు సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి చైర్మన్, ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. సీమాంధ్ర జిల్లాల్లో ఈ నెల 24న రహదారుల దిగ్బంధం జరుగుతుందని ఆయన వెల్లడించారు. 23 నుంచి 30వ తేదీ వరకు.. అంటే వారం రోజుల పాటు మొత్తం సీమాంధ్ర 13 జిల్లాల్లో ఉన్న ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ బంద్ చేస్తామని తెలిపారు.
హైదరాబాద్‌లో మరోమారు సద్భావన సదస్సు నిర్వహిస్తామని అశోక్‌బాబు చెప్పారు. గతంలో హైదరాబాద్లోను, శుక్రవారం నాడు విజయవాడలోను నిర్వహించిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలు విజయవంతమైన తీరును బట్టే ప్రజలు సమైక్యాంధ్రకు ఎంతగా మద్దతు తెలుపుతున్నారో అర్థం చేసుకోవాలని సూచించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తున్నామని ఆయన అన్నారు.
శనివారం సాయంత్రం 6-8 గంటల వరకు సీమాంధ్రజిల్లాల్లో కరెంట్ కోత విధిస్తామని, 24న సీమాంధ్ర జిల్లాల్లో రాస్తారోకో , ధర్నాలు చేయాలని నిర్ణయించామని అన్నారు. 23 నుంచి 30 వరకు సీమాంద్ర జిల్లాలో ప్రైవేట్ స‌్కూల్ యాజామాన్యాన్ని కోరారు. 27, 28 న హైదరాబాద్తో పాటు సీమాంద్ర జిల్లాల్లో కేంద్రప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించనున్నట్లు చెప్పారు.