
'ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదు'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వమ్ము చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వమ్ము చేస్తున్నాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ప్రత్యేక హోదా అనేది ఐదు కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అని, ప్రత్యేక హోదాకు ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదన్నారు. ప్రత్యేక హోదా కోసం అధికార టీడీపీ ఎందుకు పోరాడటం లేదని ధర్మాన ప్రశ్నించారు.
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ మాత్రమే అలుపెరగని పోరాటం చేస్తోందన్నారు. ఈమేరకు ఈ నెల 26 వ తేదీ నుంచి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరులో చేపట్టే నిరవధిక నిరాహారదీక్షను విజయవంతం చేయాలని ప్రజలకు ధర్మాన పిలుపునిచ్చారు.