జాతీయ రహదారి 214లోని తాళ్లరేవు బైపాస్ రోడ్డులో తీవ్రగాయాలపాలైన ఓ వృద్ధురాలు కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
తాళ్లరేవు : జాతీయ రహదారి 214లోని తాళ్లరేవు బైపాస్ రోడ్డులో తీవ్రగాయాలపాలైన ఓ వృద్ధురాలు కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కోరంగి పోలీసులు, కోరంగి దుర్గామల్లేశ్వరస్వామివారి వృద్ధుల ఆశ్రమం నిర్వాహకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వృద్ధురాలు గత నెల 27వ తేదీ రాత్రి తాళ్లరేవు బైపాస్ రోడ్డులో ప్రమాదానికి గురైంది. కుడి చేయి, ఎడమ కాలుకు తీవ్రగాయాలైన ఆమెను నీలపల్లి ఎకై్సజ్ చెక్‌పోస్టు కానిస్టేబుల్ కె.ఆనందరాజు తదితరులు గమనించి తాళ్లరేవు ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. అనంతరం కోరంగి పోలీస్‌స్టేషన్లో సమాచారం ఇవ్వడంతో వారు స్థానిక వృద్ధాశ్రమంలో తెలియజేయాలన్నారు. కాగా, ఆ వృద్ధురాలికి తాళ్లరేవు ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం శనివారం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె తన పేరు చందాల నారాయణమ్మ అని, తమది ఆర్యవటం గ్రామంలోని గొల్లలవీధి అని చెప్పింది. తనకు భర్త నెరెళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నట్టు వివరించింది. అయితే తాళ్లరేవు ఎందుకువచ్చిందో, ఎలా ప్రమాదానికి గురైందో చెప్పలేదు.