హెరిటేజ్ డైరీలో వాచ్‌మెన్ మృతి | Watchmen dies due to Electrocution | Sakshi
Sakshi News home page

హెరిటేజ్ డైరీలో వాచ్‌మెన్ మృతి

Aug 20 2015 3:20 PM | Updated on Sep 3 2017 7:48 AM

హెరిటేజ్ డైరీలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.

కొండాపురం (నెల్లూరు జిల్లా) : హెరిటేజ్ డైరీలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండల కేంద్రంలోని హెరిటేజ్ డైరీలో జరిగింది. మండల కేంద్రానికి చెందిన నర్సింహా(56) హెరిటేజ్ డైరీలో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు.

కాగా గురువారం మోటర్ వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement