ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీ పేరు అనైక్య పార్టీ అని, గుర్తుగా ‘పెప్పర్స్ స్ప్రే’ పెడితే
అనైక్య పార్టీ.. పెప్పర్ స్ప్రే గుర్తు
న్నాపురం(కొయ్యలగూడెం),
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీ పేరు అనైక్య పార్టీ అని, గుర్తుగా ‘పెప్పర్స్ స్ప్రే’ పెడితే బాగుంటుందని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఎద్దేవా చేశారు.
వైసీపీ కన్నాపురం గ్రామ కన్వీనర్ గాడిచర్ల సోమేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద పార్టీ నేతలతో బాలరాజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమైక్య ఉద్యమాన్ని పక్కదారి పట్టించటానికే సీఎం రాజీనామా డ్రామా ఆడుతున్నారని, ఇందుకు లగడపాటి, ఎన్‌జీవో అసోసియేషన్ నేత అశోక్‌బాబు సహకరిస్తున్నారన్నారు.
పదవిలో ఉండి పోరాటం చేయాల్సిన సమయంలో చేయక.. విభజన అంశం పీకల మీదకు వచ్చిన తర్వాత రాజీనామా చేస్తే ఏం ప్రయోజనమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వం మహానేత వైఎస్ పాలన వంటి సువర్ణ యుగం అందించడంతోపాటు ఆడపడుచులకు కోట్లాది రూపాయలు డ్వాక్రా రుణాలు రద్దు చేయడం ఖాయమన్నారు. సోనియాను చూసి ఇందిర, రాజీవ్‌ల ఆత్మలు ఘోషిస్తుంటాయని, భారతదేశ రాజకీయాల్లో మహిళా నియంతగా ఆమె శాశ్వత అపకీర్తిని మూటకట్టుకుందని పేర్కొన్నారు. సమైక్యవాదులు గడ్డం అబ్బులు, శీలం శ్రీను, వల్లూరి మాధవరావు, కె.సురేష్, అల్లూరి సూర్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.