ఉత్సాహంగా ‘వాక్‌ విత్‌ జగనన్న’

walk with jagananna programme in different areas - Sakshi

సాక్షి, అమరావతి :  రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు స్వయంగా తెలుసుకోవడానికి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని అధిగమిస్తున్న నేపథ్యంలో ‘వాక్‌ విత్‌ జగనన్న’ (జగనన్నతో కలిసి నడుద్దాం) కార్యక్రమాన్ని సోమవారం భారీఎత్తున నిర్వహిస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు దేశంలోని పలు నగరాల్లోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా ఇందులో పాల్గొంటున్నారు. విదేశాల్లోనూ అభిమానులు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

అనంతపురం: వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి జెడ్పీ ఆఫీసు దాకా నిర్వహించిన వాక్ విత్ జగనన్న కార్యక్రమం‍లో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి, అనంతపురం సమన్వయకర్త నదీం అహ్మద్‌ పాల్గొన్నారు. అదేవిధంగా ఉరవకొండలో ఎమ్మెల్యే  వై.విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వాక్ విత్ జగన్ అన్న కార్యక్రమం చేపట్టి ఉరవకొండ నుంచి బుదగవి వరకు పాదయాత్ర కొనసాగిస్తున్నారు. 

తాడిపత్రిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ రెడ్డి అన్నదానం, పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. యాడికిలో సమన్వయకర్త కేతిరెడ్డి పెద్దారెడ్డి వాక్ వీత్ జగనన్న కార్యక్రమం నిర్వహించారు.  

పశ్చిమగోదావరి: గ్రంధి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న పేరుతో పాదయాత్ర  భీమవరం  మండలం  దొంగపిండి  గ్రామంలో నిర్వహించారు. ఇందులో  వైస్సార్సీపీ మండల కన్వీనర్  తిరుమాని ఏడుకొండలు, వైస్సార్సీపీ  నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 


దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు అబ్బాయి చౌదరి, కొఠారు రామచంద్రరావుల ఆద్వర్యంలో పెదవేగి మండలం విజయరాయి గ్రామం నుంచి బలివే జంక్షన్ వరకు వాక్ విత్ జగన్ కార్యక్రమం నిర్వహంచారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు,మండల కన్వీనర్ మెట్టపల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. నరసాపురంలో నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని కొనసాగించారు.  

ఉండి మండలం ఉండి గ్రామంలో నియోజకవర్గ కన్వీనర్ పీవీఎల్‌ నరసింహరాజు ఆధ్వర్యంలో ఉండి బస్టాండ్ నుంచి గోరింతోట గ్రామం వరకు పాదయాత్ర చేశారు. ఇందులో జిల్లా యువజన అధ్యక్షులు మంతెన యోగీంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, పార్టీ నాయకులు .కార్యకర్తలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ కొట్టు సత్యనారాయణ బస్టాండ్‌ వద్ద నుంచి జయలక్ష్మి థియేటర్ వరకు రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. 

పాలకొల్లులో నియోజకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టారు.  ఇందులో  రాష్ట్ర కార్యదర్శి చెల్లెం ఆనందప్రకాశ్, మండల కన్వీనర్లు పాల్గొన్నారు.  ఉంగుటూరు మండలం చేబ్రోలులో నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు  వైఎస్ఆర్ విగ్రహం వద్ద నుంచి నారాయణ పురం మీదుగా  ఉంగుటూరు సెంటర్కి పాదయాత్ర చేశారు. 

వాక్‌ విత్‌ జగనన్న కార్యక్రమంలో  భాగంగా కోఆర్డినేటర్ కొండేటిచిట్టిబాబు ఆధ్వర్యంలో పి.గన్నవరం నుంచి అంబాజీపేట వరకు  పాదయాత్ర నిర్వహించారు. ఈ పాదయాత్రలో పాముల రాజేశ్వరీదేవి, ఎమ్ మోహనరావు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రంపచోడవరం నుంచి బందపల్లి వరకు కోఆర్డినేటర్ అనంతబాబు ఆధ్వర్యంలో  వైఎస్ జగన్ కు మద్దత్తుగా పాదయాత్ర నిర్వహించారు.

ఏలూరు నగరం ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ కన్వీనర్ కోటగిరి శ్రీధర్, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మధ్యాహ్నపు ఈశ్వరి బలరామ్, ఏలూరు సిటీ కన్వీనర్ బొద్దాని శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, దెందులూరు కన్వీనర్ కొఠారు అబ్బాయ్ చౌదరి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు దినేష్ రెడ్డి, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

కృష్ణా:  శాసనసభ్యులు కొడాలి నాని అధ్వర్యంలో జిల్లాలోని గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు, నందివాడ మండలాల్లో వాక్ విత్ జగన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమనికి  వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు.

వైఎస్‌ఆర్‌: కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు, ఎమ్మెల్యే  అంజాద్ బాషా, నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్జిల్లా పార్టీ కార్యాలయం నుంచి వాక్ విత్ జగనన్న ర్యాలీని  ప్రారంభించారు. పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వద్ద గల వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.  పులివెందులలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వాక్ విత్ జగన్ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, ప్రజలు భారీగా హాజరయ్యారు. 

రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు ఆకెపాటి అమరనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో రాజంపేటలో వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. బద్వేల్‌లో పార్టీ సమన్వయ కర్త డాక్టర్‌ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో వాక్‌ విత్‌ జగన్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. 

(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

వైఎస్‌ జగన్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా కమలాపురంలో సంఘీభావ పాదయాత్రను ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి చేపట్టారు.  వేంపల్లిలో ఎంపీపి మాచిరెడ్డి రవికుమార్ రెడ్డి, మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి, జడ్పీటీసీ షబ్బీర్ పార్టీ కార్యాలయం నుంచి వేంపల్లి బైపాస్ దగ్గర  వివేకానంద  కాలనీలో  ఉన్న వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. 

చక్రాయపేట ఇంచార్జ్ వైఎస్‌ కొండారెడ్డి,  జడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ రెడ్డిలు చక్రాయపేట నాగులగుట్ట పల్లి నుంచి  కార్యక్రమాన్ని  ప్రారంభించారు.   జమ్మలమడుగులో  పార్టీ సమన్వయ కర్త డా.సుదీర్ రెడ్డి ఆద్వర్య౦లో కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఆద్వర్యంలో వాక్ విత్ జగన్మ కార్యక్రమం నిర్వహించారు. 

నందలూరు మండల కేంద్రంలో రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్  రెడ్డి ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న కార్యక్రమం నిర్వహించారు. సౌమ్యణాద స్వామి ఆలయం నుంచి నాగిరెడ్డిపల్లి మారమ్మాలయం వరకు పాదయాత్ర కొనసాగింది. పార్టీ శ్రేణులు, వైఎస్సార్‌ అభిమానులు భారీగా తరలివచ్చారు.

కర్నూలు: వైఎస్ జగన్  ప్రజాసంకల్ప పాదయాత్ర వెయ్యి కిలో మీటర్లలు పూర్తికానున్న నేపథ్యంలో నందికొట్కూరు లో ‘వాక్ విత్ జగనన్న’ పేరుతో  ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో  నందికొట్కూరు నుంచి తర్తురు వరకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో  జడ్పీటీసీ యుగంధర్ రెడ్డి, ఎంపీటీసీలు,కౌన్సిలర్లు మరియు పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. ఆత్మకూర్ లో శ్రీశైలం నియోజక వర్గ ఇన్ చార్జ్  వైఎస్ఆర్‌సీపీ నేత బుడ్డా శేషారెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల టర్నింగ్ నుంచి పెద్ద బజార్ మీదుగా గౌడ్ సెంటర్ వరకు పాదయాత్ర చేశారు. 

డోన్ లో ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యం లో జగన్ ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా సంఘీభావ యాత్ర చేశారు. రాష్ట్ర యువజన విభాగం నాయకులు వై. ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రాలయం గ్రామ శివారులోని రాఘసుధా నుంచి రాఘవేంద్ర సర్కిల్ వరకు పాదయాత్ర నిర్వహించారు. హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో కర్నూలు నగరంలో వైఎస్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు పాదయాత్ర నిర్వహించారు.

బనగానపల్లె నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ ఇంచార్జ్ కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో బనగానపల్లె పట్టణం వైఎస్సార్ పార్టీ కార్యాలయం నుంచి వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు,కార్యకర్తలు 2 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు.

ఢిల్లీ: ఢిల్లీలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏపీ భవన్ నుంచి పండిట్ రవిశంకర్ శుక్లా లేన్ వరకు పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ప్రజాసంకల్పయాత్రలో జగన్ లక్షల మందితో మమేకమై వారి సమస్యలు తెలుసుకుంటున్నారిన, జగన్ దృష్టికి తెచ్చిన అంశాలను పార్లమెంటులో లేవనెత్తుతామని పేర్కొన్నారు. ప్రజాభివృద్ధి అంశాలు వదిలిపెట్టి అసెంబ్లీ సీట్ల కోసం టీడీపీ కేంద్రాన్ని అడగడం విడ్డూరమని, ఫిరాయింపుల ప్రోత్సహానికే సీట్ల పెంపు అడుగుతున్నారని వ్యాఖ్యానించారు.  ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ అంశాలు పార్లమెంటులో లేవనెత్తుతామని మరోసారి గుర్తు చేశారు. 

విజయనగరం : ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి , అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు పరీక్షీత్ రాజు వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని చేపట్టి కురుపాం నుంచి చినమేరంగి వరకు  పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోలగట్ల,  పార్టీ  నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో కొత్తవలస నుంచి పాత బస్టాండ్ మీదుగా వైఎస్సార్ విగ్రహాం వరకు వైఎస్‌ఆర్‌ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు జోగారావు, ప్రసన్న కుమార్ ఆద్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. 


గుంటూరు : జిల్లా వ్యాప్తంగా వాక్ విత్ జగనన్న కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నందిగం క్రాస్ రోడ్డు నుంచి చెక్ పోస్టు వరకు భారీ ర్యాలీ చేపట్టారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కారంపూడి వరకు 35 కిలోమీటర్ల పాదయాత్ర  చేశారు. పెదకూరపాడు సమన్వయకర్త కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో అమరావతి బస్టాండ్ నుంచి అమరలింగేశ్వరుని ఆలయం వరకు భారీ ర్యాలీ జరిపారు. 

వైఎస్‌ఆర్‌సీపీ తాడికొండ సమన్వయకర్త క్రిస్టినా ఆధ్వర్యంలో మేడికొండూరు నుంచి పేరేచర్ల వరకు పాదయాత్ర చేశారు. రేపల్లె పేటూరు అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన అనంతరం పాదయాత్రలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. ఈ యాత్రకు అభిమానులు, కార్యకర్తలు పెద్దఎత్తున హాజరయ్యారు.

నగరంలోని పాలెం వైఎస్‌ఆర్ విగ్రహం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు వాక్ విత్ జగనన్న కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముస్తఫా, సమన్వయకర్తలు ఎల్.అప్పిరెడ్డి, రావి వెంకటరమణ పాదయాత్ర చేశారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఇస్సప్పాలెం అమ్మవారి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. వేమూరు సమన్వయకర్త మేరుగ నాగార్జున ఆధ్వర్యంలో కొల్లూరు నుంచి వేమూరు వరకు భారీ పాదయాత్ర చేపట్టారు. తెనాలి ఇన్ ఛార్జి అన్నాబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని జరిపారు.  ప్రత్తిపాడు సమన్వయకర్త మేకతోటి సుచరిత ఆధ్వర్యంలో, వినుకొండ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో నియోజకవర్గంలో  కార్యక్రమాన్ని నిర్వహించి పాదయాత్ర చేశారు. 

నెల్లూరు : మ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న కార్యక్రమంలో భాగంగా నెల్లూరులో  కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు పాదయాత్ర చేశారు.  ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చెంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. వరికుంటపాడులో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి షేక్ అలీ అహ్మద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు.
 

శ్రీకాకుళం: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ధర్మాన ప్రసాద రావు శ్రీకాకుళం పట్టణంలో వైఎస్ఆర్ అభిమానులతో వాక్ విత్ జగన్ కార్యక్రమంలో భాగంగా 3కిలో మీటర్లు పాదయాత్ర చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  సమన్వయ కర్త నర్తు రామారావు ఇచ్చాపురంలో వందలాదిమంది కార్యకర్తలతో కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కంబాల జోగులు రాజాం టౌన్ నుంచి వస్త్రపురి కాలని వరకు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు.   

తూర్పుగోదావరి:  వైఎస్ జగన్ పాదయాత్రకు మద్దత్తుగా కొత్తపేట సాయిబాబా గుడి నుండి పలివెల వరకూ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో  వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని చేపట్టారు.  కె గంగవరం మండలంలో తామరపల్లి నుంచి గంగవరం సెంటర్ వరకు ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్  ఆధ్వర్యంలో పాదయాత్ర చేశారు. పెద్దాపురం కో ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు  సామర్లకోటలో రెండు కిలో మీటర్ల పాదయాత్ర చేశారు. ముమ్మిడివరం కోఆర్డినేటర్ పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో కొండాలమ్మ చింత నుంచి పదోమైలు రాయి సెంటరు వరకూ వాక్ విత్ జగనన్న కార్యక్రమం నిర్వహించారు. 

పాలకొల్లు పట్టణంలో సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో గాంధీబొమ్మ సెంటర్ నుంచి వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని ప్రారభించారు. 2కిలో మీటర్ల పాద యాత్ర చేశారు. తణుకులో పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు.

కృష్ణా: అవనిగడ్డ నియోజకవర్గంలో నాగాయలంక, అవనిగడ్డ మండలాల్లో నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ బాబు ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న కార్యక్రమం నిర్వహించారు. వైస్సార్సీపీ రైతు విభాగ అధ్యక్షుడు నాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కడవకోల్లు నరసింహారావు, జిల్లా ఎస్‌సీ సెల్ అధ్యక్షులు నలుకుర్తి రమేష్ కార్యకమంలో పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్ చార్జి డాక్టర్‌ జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో నందిగామలో వాక్ విత్ జగనన్న కార్యక్రమం చేపట్టారు. 

కైకలూరులో నియోజకవర్గ ఇన్ చార్జి దూలం నాగేశ్వరరావు ఆద్వర్యంలో చేపట్టిన కార్యక్రమానికి నేతలు బొడ్డు నోబుల్, ముంగర నరసింహరావు,  పార్టీ నాయకులు కార్యకర్తలుచ పాల్గొన్నారు.  శాసన సభ్యులు కొడాలి నాని అధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు, నందివాడ మండలాలులో  వాక్ విత్ జగనన్న కార్యక్రమం నిర్వహించారు.

చిత్తూరు: పుంగనూరులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో బస్టాండ్ లోని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళి అర్పించి బూరుగా పల్లి నరసింహ స్వామి ఆలయం వరకు పాదయాత్ర చేశారు. మదనపల్లిలో ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి ఆధ్వర్యంలో అంబెడ్కర్ సర్కిల్ నుంచి నీరుగట్టివారి పల్లి మార్కెట్ వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆను సాహెబ్ ఆధ్వర్యంలో కలక్టరేట్ వద్ద గల వైఎస్ఆర్ విగ్రహం వరకు పాదయాత్ర చేపట్టారు. 

తంబళ్లపల్లి నియోజకవర్గంలో వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రంలో వైఎస్‌ఆర్‌సీపీ కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని కార్యక్రాన్ని విజయవంతం చేశారు.


 

ప్రకాశం: కనిగిరి వైఎస్ఆర్‌సీపీ ఇంచార్జి బుర్రా,మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో వాక్ విత్ జగనన్న పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. చీరాలలో వైసీపీ ఇంచార్జీ యడంబాలాజి నాయకత్వంలో పట్టణ పురవీదుల్లో పార్టీ నాయకులు కార్యకర్తలు భారి ర్యాలీ నిర్వహించారు.

వైఎస్‌ జగన్  చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి అయిన సందర్భంగా ప్రకాశం జిల్లా దర్శిలో దద్దలమ్మ ఆలయం నుండి పులిపాడు శివాలయం  వరకు దర్శి నియోజకవర్గ వైఎస్‌ఆర్‌ సీపీ ఇన్‌ఛార్జ్‌ బాదం మాధవరెడ్డి వాక్ విత్ జగనన్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.

తెలంగాణలో...
హైదరాబాద్‌: వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ ఆలయం వరకు పాదయాత్ర, పాల్గొన్న వాసిరెడ్డి పద్మ, కార్యకర్తలు.

సంగారెడ్డి: జోగిపేటలో రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసిన వైఎస్సార్‌సీపీ నాయకులు. దివంగత నేత వైఎస్సార్‌ విగ్రహం నుంచి అన్నసాగర్ దర్గా వరకు పాదయాత్ర నిర్వహించి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అన్నాసాగర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనల్లో  పాల్గొన్న మెదక్ జిల్లా అధ్యక్షుడు సంజీవరావు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు మల్లయ్య యాదవ్, రాష్ట్ర సంయుక్త నాయకులు బాలకృష్ణ రెడ్డి, నాయకులు రమేష్, పరిపూర్ణ, ప్రవీణ్, అరవింద్ పవన్ కుమార్.

మహబూబ్‌నగర్ : వైఎస్‌ జగన్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా జిల్లా టీవైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షురాలు మరియమ్మ మరియు కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి కిలోమీటర్ పాదయాత్రగా బయల్దేరి వైఎస్ విగ్రహానికి పూల మాల వేశారు.  

ఖమ్మం: జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు లక్కినేని సుధీర్‌బాబు ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి నర్సింహస్వామిగుట్ట వరకు పాదయాత్ర చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు. పెద్దఎత్తున పాల్గొన్న జగన్ అభిమానులు, స్థానిక ప్రజలు.

రంగారెడ్డి : ఇబ్రహీంపట్టణంలో టీ వైఎస్‌ఆర్‌సీపీ మహిళా అధ్యక్షురాలు అమృతసాగర్‌ ఆధ్యర్యంలో వాక్‌విత్‌ జగనన్న కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ప్రజాసంకల్పయాత్ర విజయవంతం కావాలని కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వికారాబాద్‌ : కొడంగల్‌లో టీ వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్యర్యంలో ర్యాలీ నిర్వహించారు. పార్టీ జెండాను టీ వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొడంగల్‌ సమన్వయకర్త బాలరాజు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top