జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌స్టేషన్లు పెరిగాయి. పెరిగిన ఓటర్ల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల
కలెక్టరేట్ (కాకినాడ), న్యూస్‌లైన్ :జిల్లాలోని 19 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్‌స్టేషన్లు పెరిగాయి. పెరిగిన ఓటర్ల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇప్పటి వరకున్న పోలింగ్ స్టేషన్లను విభజించి, కొత్తగా పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం ఎన్నికల కమిషన్ ఆమోదానికి ప్రతిపాదనలు పంపింది. జిల్లాలో 19 నియోజకవర్గాల పరిధిలో ఇప్పటి వరకు 3,907 పోలింగ్ స్టేషన్లు ఉండగా, కొత్తగా ప్రతిపాదనలు పంపిన 75 పోలింగ్‌స్టేషన్లతో 3,982కు పెరగనున్నాయి. ప్రతిపాదిత కొత్త పోలింగ్ స్టేషన్లు తుని నియోజకవర్గంలో ఒకటి, ప్రత్తిపాడులో ఒకటి, కాకినాడ రూరల్‌లో మూడు, అనపర్తిలో మూడు, రామచంద్రపురంలో 8, కొత్తపేటలో ఒకటి, మండపేటలో ఒకటి, రాజానగరంలో 13, రాజమండ్రి రూరల్‌లో 4, రంపచోడవరం నియోజకవర్గంలో 40 ఉన్నాయి.
కొత్త పోలింగ్ స్టేషన్లతో నియోజకవర్గాల వారీగా మొత్తం తునిలో 206, ప్రత్తిపాడులో 197, పిఠాపురంలో 217, కాకినాడ రూరల్‌లో 205, పెద్దాపురంలో 203, అనపర్తిలో 212, కాకినాడ సిటీలో 213, రామచంద్రపురంలో 213, ముమ్మిడివరంలో 223, అమలాపురంలో 210, రాజోలులో 186, పి.గన్నవరంలో 208, కొత్తపేటలో 235, మండపేటలో 208, రాజానగరంలో 202, రాజమండ్రి సిటీలో 208, రాజమండ్రి రూరల్‌లో 210, జగ్గంపేటలో 214, రంపచోడవరంలో 212 ఉన్నాయి. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 164 పోలింగ్‌స్టేషన్ల భవనాలను మార్పు చేసేందుకు, 724 పోలింగ్ స్టేషన్ల భవనాల పేర్లు మార్చేందుకు ప్రతిపాదనలు పంపారు.