
బెయిల్‌పై విజయసాయిరెడ్డి విడుదల
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో నిం దితుడిగా ఉన్న ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు.
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల కేసులో నిం దితుడిగా ఉన్న ఆడిటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి బుధవారం చంచల్‌గూడ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. బెయిల్ మంజూరు చేస్తూ ప్రత్యేక కోర్టు విధించిన షరతుల మేరకు సాయిరెడ్డి తరఫు న్యాయవాది అశోక్‌రెడ్డి పూచీకత్తు బాం డ్లను కోర్టుకు సమర్పించారు. వాటిని ఆమోదించిన కోర్టు.. సాయిరెడ్డిని విడుదల చేయాలంటూ చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌కు ఉత్తర్వులు జారీచేసింది. కోర్టు ఉత్తర్వులు అందుకున్న జైలు అధికారులు మధ్యాహ్నం 2.50 నిమిషాలకు సాయిరెడ్డిని విడుదల చేశారు. అప్పటికే ఆయన అభిమానులు, వైఎస్‌ఆర్‌సీపీ నేత లు, మిత్రులు భారీ సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ నేత శేషారెడ్డి, పల్లపు రాము సాయిరెడ్డికి మిఠాయి తినిపించి, పుష్పగుచ్ఛాన్ని అందజేశారు.
మొదటి అరెస్టు..
జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో సీబీఐ మొదటగా అరెస్టు చేసింది విజయసాయిరెడ్డినే. గత ఏడాది జనవరి 2న విచారణకు హాజరైన సాయిరెడ్డిని అరెస్టు చేస్తున్నట్లు సీబీఐ ప్రకటించింది. 110 రోజుల తర్వాత సాయిరెడ్డికి ఏప్రిల్ 30న సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ హైకోర్టును ఆశ్రయించినా.. చుక్కెదురైంది. దాంతో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జగన్ కేసులో దర్యాప్తు పెండింగ్‌లో ఉందన్న కారణంగా సాయిరెడ్డి బెయిల్‌ను సుప్రీంకోర్టు గత మే 9న రద్దుచేసింది. జూన్ 5న సీబీఐ ప్రత్యేక కోర్టులో లొంగిపోయిన సాయిరెడ్డి.. అప్పటి నుంచి చంచల్‌గూడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు పూర్తికావడంతో.. సాయిరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దానిని పరిశీలించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది.