రుణమాఫీకి చందాలంటూ... | Vasireddy Padma takes on AP CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

రుణమాఫీకి చందాలంటూ...

Sep 18 2014 1:10 PM | Updated on Aug 18 2018 8:05 PM

రుణమాఫీకి చందాలంటూ... - Sakshi

రుణమాఫీకి చందాలంటూ...

పింఛన్లపై ఏపీ సర్కార్ విడుదల చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు.

హైదరాబాద్: పింఛన్లపై ఏపీ సర్కార్ విడుదల చేసిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. గురవారం హైదరాబాద్లోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ... వయో వృద్ధల పింఛన్లపై జీవోలు, కమిటీలంటూ కోతలు విధించడం ఎంత వరకూ సమంజసం అని ప్రశ్నించారు.

సామాజిక కార్యకర్తల పేరుతో టీడీపీ నేతలకు కమిటీల్లో చోటు కల్పించడం పట్ల ఆమె అభ్యంతరం ఆగ్రహాం వ్యక్తం చేశారు. టీడీపీకి ఓటేసిన వారికి పింఛన్లా అంటూ చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. రుణమాఫీకి చందాలంటూ... రైతుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తున్నారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఎద్దేవా చేశారు. బిచ్చమెత్తుకుని అప్పులు తీర్చాలంటే ఏ రైతూ అంగీకరించడని వాసిరెడ్డి పద్మ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement