మళ్లీ మోతపడుద్ది! | Usual for carrying the burden of the people | Sakshi
Sakshi News home page

మళ్లీ మోతపడుద్ది!

Dec 27 2013 3:58 AM | Updated on Sep 2 2017 1:59 AM

ప్రజలకు భారం మోయడం అలవాటైపోయింది. అందుకే ఎడాపెడా అన్నీ పెంచేసి చోద్యం చూస్తోంది ప్రభుత్వం.ఏదో నాలుగురోజులు సమ్మెలు, ధర్నాలు, విపక్షాల అరుపులు, ప్రజా సంఘాల గగ్గోలు.

ప్రజలకు భారం మోయడం అలవాటైపోయింది. అందుకే ఎడాపెడా అన్నీ పెంచేసి చోద్యం చూస్తోంది ప్రభుత్వం.ఏదో నాలుగురోజులు సమ్మెలు, ధర్నాలు, విపక్షాల అరుపులు, ప్రజా సంఘాల గగ్గోలు. అన్నీ బేకాతర్ అనుకుంటే అవే సర్దుకు పోతాయి. ఇదీ పాలకల ఎత్తుగడ. జనాన్ని పిండే పథకం. ఇప్పుడు మళ్లీ విద్యుత్తు చార్జీల రూపంలో షాక్ ఇవ్వనుంది. సామాన్యుడ్ని  హడలెత్తించనుంది.
 
 పాలమూరు, న్యూస్‌లైన్ : ఇప్పటికే పెరిగిన విద్యుత్ చార్జీలు.. సర్ చార్జీల తో అవస్థ పడుతున్న  సామాన్య జనానికి చార్జీల పెం పుతో మరోసారి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఒక పక్క చార్జీలు పెరుగుతూ పోతుంటే సామాన్యుడి ఇం ట్లో ఎలక్ట్రానిక్ గృ హోపకరణాలు ఒక్కొక్కటిగా మూ లకు చేరుతున్నాయి. నెలవారీ బిల్లు తగ్గింకునేందుకు వారు ఇప్పటికే ముప్పుతిప్పలు పడుతున్నారు.. కాం గ్రెస్ ప్రభుత్వం 2011, 2013 సంవత్సరాల్లో విద్యుత్ చార్జీలను పెంచింది.
 
 దీంతోపాటు సర్దుబాటు పేరిట అ దనంగా వసూలు చేస్తూ విద్యుత్ వినియోగదారులకు ఇప్పటికే చుక్కలు చూపిస్తోంది. ఇవి చాలవన్నట్లు తా జాగా  మరోసారి చార్జీలను పెంచేందుకు సమాయత్తం అవుతోంది. ఈ మేరకు యూనిట్ల వారీగా పెంచే చార్జీల తో ఈఆర్‌సీ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిం చింది. వాటినే యథావిధిగా ప్రభుత్వం ఆమోదం తెలి పితే వచ్చే ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలు పెరుగుతా యి. ఈ భారం జిల్లాపై నెలకు రూ.14 కోట్లు ఉంటుందని అంచనా.. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కేవలం 300 యూనిట్లు దాటి విద్యుత్తును వినియోగించుకునే వారిపై భారం మోపింది. తరువాత స్లాబ్‌లను మార్చి సామాన్య, మధ్య తరగతి ప్రజలపై విద్యుత్ చార్జీలను రుద్దింది. తాజాగా అన్ని వర్గాలపై భారం వేయనున్నారు. 150 యూనిట్లు వాడుకునే వినియోగదారులకు 50 పైసలు ఇంతకంటే ఎక్కువగా వినియోగించుకునే వారు ప్రస్తుతం చెల్లిస్తున్న దానికి అదనంగా రూపాయి భారం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన సగటున రూ.1.07 భారం పడుతోంది. దీంతోపాటు పరిశ్రమలు, పంచాయతీలకు విద్యుత్ చార్జీలను పెంచేందుకు ప్ర తిపాదనల్లో పేర్కొంది. జిల్లాలో గృ హావసరాలు, ఇతర కనెక్షన్లు దాదాపు 5,58,990 ఉంటాయి. వీటి వల్ల నెలకు రూ.16.25 కోట్ల ఆదాయం వస్తుండగా భారీ పరిశ్రమలు తదితర వాటితో రూ.18కోట్లు ఆదాయం వస్తోంది. ప్రతిపాదిత చార్జీల ప్రకారం విద్యుత్ శాఖకు అదనంగా రూ.14 కోట్లు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
 
 అధికారుల అంచనా ప్రకారం 51-100 యూనిట్ల విద్యుత్తును వినియోగమయ్యే కనెక్షన్లు 2.20 లక్షలు ఉంటాయి. 101-200 యూనిట్ల విద్యుత్తును వినియోగించే కనెక్షన్లు 1.50 లక్షలు ఉంటాయి. 201-300 యూనిట్లు వినియోగించుకునే వినియోగదారులు 1.30 లక్షలు ఉంటారు. జిల్లా మొత్తం నెలకు 16 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వాడకం ఉంటుంది. అయితే పెంపు భారం ఎక్కువగా 200 యూనిట్లు వినియోగించే మధ్యతరగతి ప్రజలపై పడనుంది.  ఈ దఫా ఎల్‌టీ కనెక్షన్లను వర్గీకరించి యూనిట్ల వ్యయంలో మార్పులు చేశారు. చార్జీల పెంపు వల్ల వ్యాపార, వాణిజ్య వర్గాలతోపాటు పంచాయతీలు, విద్యుత్తు దీపాలు, ఎత్తిపోతల పథకాలు, మంచినీటి పథకాలు తదితర వాటిపై విద్యుత్తు చార్జీల భారం పడనుంది.
 
 ఎత్తిపోతల పథ కాల నిర్వహణ ఇక భారం
 ఎత్తిపోతల పథకాలపై కూడా ప్రభుత్వం చార్జీల భారం మోపింది. 33 శాతం అదనంగా పెంచుతూ తీసుకున్న నిర్ణయం వల్ల వీటి నిర్వహణ ఇక నుంచి రైతులకు భారం కానుంది. యూనిట్‌కు సగటున రూ.5.35 నుంచి రూ.7.10కి పెంచుతూ ప్రతిపాదించారు. జిల్లాలో ఏపీఎస్‌ఐడీసీ, ఐటీడీఏ, ఎస్సీ కార్పోరేషన్, బీసీ కార్పోరేషన్, ఎన్‌ఎస్‌పీ పరిధిలో ఎత్తిపోతల పథకాలు పనిచేస్తున్నాయి. విద్యుత్ చార్జీల పెంపుదలతో వీటి నిర్వహణ ప్రశ్నార్థకం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement