నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం, డేవిస్‌పేటలోని స్టార్ ఆగ్రో ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా అమోనియా గ్యాస్ లీకవడంతో యాభై మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు.
నెల్లూరు : నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఇందుకూరుపేట మండలం, డేవిస్‌పేటలోని స్టార్ ఆగ్రో ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి ఒక్కసారిగా అమోనియా గ్యాస్ లీకవడంతో యాభై మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 38 మంది పరిస్థితి విషమంగా ఉంది. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.
మరోవైపు కార్మాగారంలోని ఇతర ప్లాంట్లో పనిచేస్తున్న ఇతర కార్మికులను బయటకు పంపించి, గ్యాస్ లీకును అదుపులోకి తీసుకు వచ్చారు. ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావటంతో కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు. కాగా ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. అయితే స్థానిక ప్రాథమిక చికిత్స కేంద్రంలో కనీస వనరులతో పాటు ఆక్సిజన్ సిలెండర్ లేకపోవటంపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు.